Shani Transit 2023: ఈ రాశులవారికి శని అనుగ్రహంతో లగ్జరీ జీవితాలతో పాటు ఆర్థిక లాభాలు ప్రారంభం!
Shani Gochar 2023: శని గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా భారీ లాభాలు కలుగుతాయి.
Shani Transit 2023: శని గ్రహం రెండు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సంచారం చేస్తుంది. అయితే ఈ సంచారం ప్రభావం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. శని గ్రహం సంచారం చేసిన తర్వాత కూడా కొన్ని కొన్ని సార్లు రాశుల్లో తిరోగమనం దశగా తిరుగుతూ ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై రెట్టింపు ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రభావం వ్యక్తుల కర్మలను బట్టి ఆధార పడి ఉంటుంది. వ్యక్తులు తమ జీవితంలో మంచి పనులు చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. లేకపోతే తీవ్ర దుష్ప్రభావాలను చూపే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శని గ్రహం త్వరలోనే కుంభరాశిలోకి తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడ మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి శని అనుగ్రహం లభించబోతోంది:
మేష రాశి:
శని సొంత రాశి అయిన కుంభ రాశిలోకి సంచారం చేయడం వల్ల మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ రాశివారికి శని కార్యాధిపతిగా వ్యవహరిస్తూ లాభ గృహంలో ఉంటాడు. కాబట్టి ఈ క్రమంలో వీరికి కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు ఉద్యోగాల్లో కూడా తీవ్ర మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు ఇతర కంపెనీలలో కూడా ఉద్యోగాలు పొందుతారు. దీని కారణంగా ప్రమోషన్స్‌తో పాటు జీతాలు కూడా పెరగవచ్చు. ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించిన సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు నిరుద్యోగాలకు కూడా కొత్త కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి శనిగ్రహం సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని దేవుడి అనుగ్రహం కారణంగా ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు నిలిపోయిన పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ క్రమంలో అదృష్టం రెట్టింపు అవుతుంది. కాబట్టి వ్యాపారాలు చేసేవారికి ఆర్థికంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Also Read: Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్
మిథున రాశి:
మిథున రాశివారికి కూడా ఈ సమయంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపునులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరి అదృష్టం రెట్టింపు అవ్వడం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే వ్యాపారాలు చేసేవారు దూర ప్రయాణాలు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ రాశివారు మీ పిల్లల నుంచి కూడా ఈ సమయంలో శుభ వార్తలు వింటారు.
తులా రాశి:
తులా రాశి వారికి కూడా శని గ్రహం సంచారం ప్రభావం కారణంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇదే సమయంలో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ రాశివారికి ఆనందం, ఆదాయ వనరులు కూడా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ సమయంలో వీరు కొత్త ఆస్తులు కూడా పొందుతారు. దీంతో పాటు కొంతమంది వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. తుల రాశివారికి శని దేవుడి సంచారం కారణంగా గౌరవం, ప్రతిష్టలు లభిస్తాయి.
Also Read: Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి