Saturn Transit 2023 Predictions: శని గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ గ్రహం వ్యక్తుల కర్మలను బట్టి అనుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అంతేకాకుండా ఈ గ్రహం జాతకాల్లో అనుకూల స్థానాల్లో సంచారం చేస్తే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అదే ప్రతికూల స్థానాల్లో సంచారం చేస్తే వ్యక్తిగత జీవితంలో దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని గ్రహం నవంబర్ 4వ తేదీన నేరుగా కుంభరాశిలోకి సంచారం చేయబోతోంది ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారిపై శని గ్రహ ప్రత్యక్ష ప్రభావం పడబోతోంది. ఈ సమయంలో ఏయే రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం:
సింహ రాశి:

ఈ శని గ్రహం సంచారం చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితాల్లో ఎదురవుతున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఒక ఉద్యోగాలు చేసేవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి ఊహించని లాభాలు కూడా కలుగుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు కూడా కొత్త ప్రాజెక్ట్స్‌ పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


మకర రాశి:
మకర రాశివారికి శని గ్రహం సంచారం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ప్రాజెక్ట్స్‌ అన్ని విజయవంతమై భారీ లాభాలు పొందుతారు. అయితే వ్యాపారాలు ప్రారంభించేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పనులు చేసేవారు ఈ గ్రహ సంచారాల క్రమంలో ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.


వృషభ రాశి:
వృషభ రాశివారికి నవంబర్‌ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఊహించని ప్రయోజనాలు పొందుతారు. శని అనుగ్రహం వీరికి లభించి యజమానుల మద్ధతు కూడా లభిస్తుంది. దాంపత్య జీవితంలో కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. తీవ్ర వ్యాధులన్నీ ఈ సమయంలో దూరమవుతాయి. 


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.