These five zodiac signs have auspicious due to Shani Transit 2023: 2023 సంవత్సరం ప్రారంభంలోనే (జనవరి 17) శని దేవుడు కుంభ రాశిలోకి సంచరించబోతున్నాడు. శని సంచారం కారణంగా 'శష్ పంచ మహాపురుష రాజయోగం' ఏర్పడుతుంది. ఇది జ్యోతిషశాస్త్రంలో చాలా పవిత్రమైన మరియు ఎంతో శక్తివంతమైన రాజయోగం. 30 సంవత్సరాల తరువాత శని తన స్వంత రాశిలో కుంభ రాశిలోకి మారడం వలన 12 రాశులపైనా పెను ప్రభావం ఉంటుంది. అయితే శని సంచారం ఈ 5 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: 
శని సంచారం వలన ఏర్పడిన షష్ రాజయోగం మేష రాశి వారికి చాలా లాభాలను తెచ్చిపెడుతుంది. అదృష్టం ఎప్పుడూ వెంటే ఉంటుంది. భారీగా ఆదాయం పెరుగుతుంది. ప్రతి పనిలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది.


వృషభం: 
శని మరియు శుక్రుడు స్నేహ గ్రహాలు కాబట్టి శని రాశి మార్పు వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. శని అనుగ్రహంతో వృషభ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆకస్మిక  ధనలాభం ఉంటుంది. వివాహ అవకాశాలు మెండుగా ఉన్నాయి.


కన్యా: 
శని సంచారం వలన ఏర్పడిన షష్ రాజయోగం కన్యా రాశి వారి జీవితాలలో అనేక విధాలుగా లాభాలను ఇస్తుంది. వివాదాలు, న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఒత్తిడి పూర్తిగా దూరమవుతుంది. మీరు అనుకున్న పని జరుగుతుంది. జీవితంలో ఆనందం ఉంటుంది.


మకరం: 
శని గ్రహం మకర రాశిని వదిలి కుంభ రాశిలో ప్రవేశించడంతో.. మకర రాశి వారికి కెరీర్‌లో గొప్ప విజయాలు అందుతాయి. కొత్త ఉద్యోగం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు భారీ లాభాలు ఉన్నాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. 


కుంభం:
కుంభ రాశిలో శని ప్రవేశించడం ద్వారా శష్ రాజయోగం ఉంటుంది. కుంభ రాశి ప్రజలు శష్ రాజయోగం ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి పని అదృష్టం కారణంగా పూర్తవుతుంది. పాత వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. పార్టనర్‌షిప్‌తో పని చేసే వారు అద్భుతమైన విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందం విరాజిల్లుతుంది. 


Also Read: Shani Dev Remedies: మీరు ఈ దేవతల భక్తులా.. అయితే శని దేవుడు ఎప్పుడూ మీ దరిదాపులకు కూడా రాడు! 


Also Read: Ind Vs Ban: టీమిండియాలో కీలక మార్పు.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్‌కు పిలుపు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.