Saturn Transit on Dhanteras 2022: ఈసారి ధనత్రయోదశి రోజున ప్రత్యేకమైన యోగం ఏర్పడబోతుంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. కర్మదాత, న్యాయదేవుడు అయిన శనిదేవుడు ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబరు 23 అంటే ధనత్రయోదశి (Dhanteras 2022) రోజున శనిదేవుడు మకరరాశిలో ప్రత్యక్ష సంచారంలోకి (Saturn Transit in Capricorn 2022) రానున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారు కెరీర్ మరియు ఆర్థిక పరంగా ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి (Aries): మేషరాశి వారికి శని సంచారం చాలా ప్రత్యేకంగా భావిస్తారు.  శని ప్రభావం వల్ల మేష రాశి వారికి ధనత్రయోదశి నాడు ధనప్రాప్తి, వ్యాపారంలో పురోగతి కలుగుతుంది. ఇనుము, ఎలక్ట్రికల్, వాహనాల వ్యాపారం చేసేవారు ఈ సమయంలో భారీగా సంపాదిస్తారు. 


సింహ రాశి (Leo): శని సంచారం సింహరాశివారికి కలిసి వస్తుంది. మీకు డబ్బు పరంగా లాభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో ఎదుగదలకు అవకాశం ఉంది. జాబ్ వచ్చే అవకాశం ఉంది. 


తులారాశి (Libra): దీపావళికి ముందు తులారాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. శని మీ జాతకంలో నాల్గో ఇంట్లో సంచరిస్తాడు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ రాశి వారికి ధనత్రయోదశి నాడు బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పిల్లల పురోగతికి కొత్త మార్గాలను తెరుచుకుంటాయి. 


వృశ్చిక రాశి  (Scorpio): వృశ్చిక రాశి వారికి శని సంచారం చాలా అదృష్టం. ఈ సమయంలో కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. మీరు భూమి మరియు ఆస్తి పరంగా ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి.  


మీనరాశి (Pisces): మీన రాశి వారికి శని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కెరీర్‌లో అనేక బంగారు అవకాశాలను అందుకుంటారు. ఇప్పటివరకు వ్యాపారంలో నష్టాలను చవిచూసిన వారికి శనిగ్రహ ప్రభావంతో శుభకాలం ప్రారంభమవుతుంది. మీరు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఇంటి సమస్యలు దూరమవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో విజయం సాధిస్తారు.


Also read: Shukra Gochar 2022: మరో 2 రోజుల్లో శుక్రుడి రాశి మార్పు... ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్, ఐశ్వర్యం! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook