Shani Uday 2023 impact on Zodiac Signs: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత ఉదయించడం, అస్తమించడం, రాశిని మార్చడం చేస్తాయి. గ్రహాల అస్తమయం శుభప్రదం కాదు. జనవరి 30న శనిదేవుడు కుంభరాశిలో అస్తమించాడు. ఇది కొన్ని రాశులవారికి శుభఫలితాలను ఇచ్చింది. మార్చి 06న శని మళ్లీ ఉదయించాడు. ఇది చాలా మంది జీవితాల్లో అనందం వెల్లివిరిసేలా చేశాడు. శని రైజింగ్ వల్ల ధన రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారు అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడి ఉదయం ఈ రాశులకు వరం
వృషభం: ఈ రాశి వారికి ఉద్యోగరీత్యా శని ఉదయించడం చాలా శుభప్రదం. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. వివాహం కుదిరే అవకాశం ఉంది. 
సింహ రాశి: శని ఉదయించడం వల్ల సింహ రాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆస్తి ద్వారా లాభం ఉంటుంది. పాత వివాదాలకు తెరపడుతుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. 
కుంభం: కుంభరాశిలో శని ఉదయించడం వల్ల ఏర్పడే ధన రాజయోగం కుంభరాశి వారికి గొప్ప లాభాలను ఇస్తుంది. అంతేకాకుండా వీరి జాతకంలో శష్ రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రెండు యోగాలు కుంభ రాశి వారికి బంపర్ ప్రయోజనాలను ఇస్తాయి. మీరు శని సాడే సతి కష్టాల నుండి విముక్తి పొందుతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రగతి పథానికి దారులు తెరుచుకుంటాయి. 


Also Read: Budh Gochar 2023: మీనరాశిలోకి బుధుడు.. ఇవాల్టి నుండి ఈ రాశులకు కావాల్సినంత డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook