Saturn Retrograde 2023: వ్యతిరేక దిశలో నడుస్తోన్న శని.. ఈ 3 రాశులకు బ్యాడ్ టైమ్ స్టార్ట్..
Shani vakri 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని తిరోగమనం కుంభం, మకరం, మీనరాశులవారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023 effect: కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబరు 04 వరకు అదే స్థితిలో ఉంటాడు. సాధారణంగా మకరం మరియు కుంభరాశులకు శనిదేవుడు అధిపతి. మీనరాశిలో శనిదేవుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ప్రస్తుతం ఈ మూడు రాశులపై శని సడేసతి కొనసాగుతుంది. శని యెుక్క రివర్స్ కదలిక ఈ 3 రాశులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం.
మకరరాశి
ఈ రాశికి అధిపతిగా శనిని భావిస్తారు. ఈ సమయంలో మీరు కుటుంబంలో గొడవలు తలెత్తుకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు మీరు మీ ప్రేమను పంచండి. కోపాన్ని వీడనాడండి. ఫ్యామిలీ ఐకమత్యంగా ఉంటేనే మీకు మంచిది. దేశ రాజకీయాలపై ఓ కన్నేసి ఉంచండి. మెుత్తానికి శని సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.
కుంభ రాశి
శని తిరోగమన స్థితి కుంభ రాశి వారికి మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది, కాస్త మంచి డైట్ ఫాలోవ్వండి. మీపై శనిదేవుడి కటాక్షం ఎల్లప్పుడు ఉంటుంది. మీరు కష్టాల నుండి బయటపడతారు. బ్యాడ్ టైమ్ స్టార్ అయినప్పుటికీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు.
Also Read: Shukra Mangal yuti 2023: సింహరాశిలో శుక్రుడు, కుజుడు కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..
మీనరాశి
మీన రాశి వారు ఇల్లు లేదా వాహనం మరమ్మతులకు డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. తిరోగమన శని ప్రభావం వల్ల మీలో అహంకారం పెరుగుతుంది. కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వినయంతో ఉండాలి. కుటుంబంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు రాకుండా చూసుకోండి. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
Also Read: Ketu Gochar 2023: కేతు సంచారంతో ఈ రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook