Saturn Retrograde 2023: కుంభరాశిలో సంచరించనున్న శని.. ఈ రాశుల జీవితం అల్లకల్లోలం
Saturn Retrograde: ఇవాళ శని గ్రహం కుంభరాశిలో తిరోగమనం చేయనుంది. దీని కారణంగా మూడు రాశుల వారి జీవితం ఇబ్బందుల్లో పడనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Vakri in Kumbh Rashi 2023: నవగ్రహాల్లో శనికి ప్రత్యేక స్థానం ఉంది. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అదే ఇతడి చెడు దృష్టి పడిందంటే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారతాడు.
ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో సంచరిస్తోంది. ఇవాళ అంటే జూన్ 17న అదే రాశిలో తిరోగమనం చేయనుంది. ఇదే స్థితిలో నవంబరు 04 వరకు ఉంటాడు. శని వ్యతిరేక కదలిక ప్రభావం మూడు రాశులవారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆ అన్ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
శనితిరోగమనం ఈ 3 రాశులకు నరకం
సింహం: శని తిరోగమనం సింహరాశి వారికి చాలా బాధను కలిగిస్తుంది. ఈ రాశివారు మానసిక ఒత్తిడిగి గురయ్యే అవకాశం ఉంది. ఎక్కడైనా డబ్బు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరితోనూ వాదించవద్దు. అలాగే ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు.
Read More: Gupta Navratri 2023: గుప్త నవరాత్రు ప్రత్యేకత, మహావిద్యలంటే ఏమిటి, ఆరాధన శుభ సమయం..
వృశ్చికం: శని వ్యతిరేక కదలిక వృశ్చిక రాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. ఉద్యోగం-వ్యాపారంలో అడ్డుంకులు వస్తాయి. వ్యాపారంలో భారీగా నష్టాలు రావచ్చు. సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. మీరు శారీరక లేదా మానసిక ఒత్తిడిని ఎదుర్కోనే అవకాశం ఉంది. డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి చేయండి.
మీనం: శని రివర్స్ కదలిక మీన రాశి వారికి కష్టాలను పెంచుతుంది. మీ మాటలు మీకు కష్టాలు తెచ్చిపెడతాయి. మీ దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు అప్పుల్లో కూరుకుపోయే అవకాశం ఉంది.
Also Read: Guru Chandal Rajyog: గురు చండాల యోగం మెుదలు... అక్టోబరు 30 వరకు ఈ 3 రాశులకు నరకం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook