Shani Vastu Tips, Never do these small things in your life: శని దేవుడు ఓ వ్యక్తికి అతని కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. ఒక వ్యక్తికి తన జాతకంలో శని మహాదశ ఉన్నట్లయితే (శని బలహీన స్థితిలో ఉన్నట్లయితే) ఆ వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అతడు అన్ని పనుల్లో పరాజయం పొందుతాడు. ఏదీ కలిసిరాదు. మరోవైపు శని అనుకూలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో ఆనందం, సుఖం, ఐశ్వర్యం పొందుతాడు. ఏ పని చేసినా అంతా కలిసి వస్తుంది. అందుకే వ్యక్తి జాతకంలో శని కీలక పాత్ర పోషిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని దేవుడు వ్యక్తి జాతకంలో అశుభ స్థానంలో ఉంటే.. అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ వ్యక్తి జీవితంలో నిత్యం సమస్యలతో పోరాడాల్సి ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి శని ఉన్నట్లు అస్సలు తెలియదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి చిన్న తప్పుల వల్ల కూడా జీవితం మొత్తం సమస్యలతో సతమతమవ్వాల్సి ఉంటుంది. ఇతరుల వస్తువులను ఉపయోగించడం ద్వారా శని దేవుడు కోపానికి గురవుతాడని గ్రంధాలలో చెప్పబడింది. శని దేవుడికి కోపం తెప్పించే విషయాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.


ఈ విషయాలు శని దేవుడికి కోపం తెప్పిస్తాయి:
# బట్టలు, బూట్లు లేదా కొన్ని ఇతర వస్తువులను కొందరు ప్రజలు వేరే వారివి ఉపయోగిస్తుంటారు. మీరు చేసే ఈ చిన్న పొరపాటు మీ జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది. ఇతరుల దుస్తులు ధరించడం వల్ల పేదరికంలో కూరుకుపోతారు. 


# ఇతరుల ఉంగరాన్ని లేదా రత్నాన్ని ధరించడం కూడా అశుభం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన శని దేవుడికి కోపం వస్తుంది. దాంతో దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంటుంది.


# విద్యార్థులు ఒకరి నుంచి పెన్-పెన్సిల్స్, పెన్సిల్స్, పెన్ లాంటివి తీసుకొని ఉపయోగిస్తారు. ఇది సరైనది కాదు. ఇది ప్రతికూలతను పెంచుతుంది. దాంతో ప్రతికూల ఫలితాలను పొందుతాడు.


Also Read: బృహస్పతి 'అఖండ సామ్రాజ్య యోగం'.. ఈ 3 రాశుల వారు కోట్ల ఆస్తులకు యజమానులవుతారు!


Also Read: రెడ్‌ శారీలో సెగలు రేపుతున్న జాన్వీ కపూర్.. బిగుతైన ఎద అందాలతో రెచ్చిపోయిందిగా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook