Shanichar Amavasya 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారమనేది శనిదేవుడికి అంకితం. కొన్ని పద్ధతులు పాటిస్తే..శనిదోషం నుంచి శని ప్రభావం నుంచి విముక్తులు కావచ్చు. భాద్రపద అమావాస్య కూడా శనివారమే రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతంలో అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది. భాద్రపద మాసం అమావాస్య ఈసారి శనివారం నాడు వచ్చింది. దీనిని భాద్ర అమావాస్య లేదా శనీచర అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున  దానాది కార్యక్రమాలు, తర్పణం, పిండదానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈసారి భాద్ర అమావాస్య ఆగస్టు 27న ఉంది. శనివారం కావడంతో కొన్ని రాశులకు అత్యంత ప్రత్యేకంగా మారనుంది. 


శని మహాదశ, శని పీడతో బాధపడేవారికి శనివారం అమావాస్య ప్రధానమైంది. ఈ రోజున జ్యోతిష్యం ప్రకారం కొన్ని పద్ధతులు లేదా ఉపాయాలు పాటిస్తే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఏ రాశులపై శని పీడ, శని మహాదశ ఉంది..ఏయే ఉపాయాలు చేయాలనేది తెలుసుకుందాం..


శని ప్రస్తుతం మకర రాశిలో వక్రమార్గంలో ఉండటం వల్ల ధనస్సు, మకర, కుంభ రాశులకు శని పీడ, శని ప్రభావం పడుతోంది. అటు మిధున, తుల రాశుల జాతకులపై శని పీడ నడుస్తోంది. జ్యోతిష్యం ప్రకారం శని పీడ, శని గోచారం పీడిత జాతకులకు శారీరకంగా, మానసికంగా , ఆర్ధికంగా కష్టాలు తప్పవు. శని ప్రతికూల, అశుభ ప్రభావాల్ని తగ్గించేందుకు ఆగస్టు 27వ తేదీ అమావాస్యనాడు కొన్ని ఉపాయాలు పాటించాలి.


గానుగ నూనెలతకో శని దేవుడికి పూజలు చేయాలి. దాంతోపాటు నల్ల మినప పప్పుతో చేసిన ఇమ్రుతీని శనిదేవుడికి అర్పించాలి. శని అమావాస్యకు ఒకరోజు ముందు అంటే శుక్రవారం నాడు 1.25 కిలోల నల్ల మినప పప్పును ఓ వస్త్రంలో చుట్టి రాత్రి పక్కన పెట్టుకుని పడుకోవాలి. అయితే ఒంటరిగానే పడుకోవాలి. ఆ తరువాత మరుసటి రోజు శని అమావాస్య నాడు ఏదైనా శనీశ్వరాలయంలో వస్త్రంలో చుట్టిన మినపపప్పుని ఉంచాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి.


శనీచర అమావాస్య నాడు నీడను దానం చేయాలి. ఒక గిన్నెలో గానుగ నూనె, ఒక కాయిన్ వేసి ఆలయంలో పెట్టాలి. నూనెతో కూడిన గిన్నెను ఆలయం లేదా ఎవరైనా నిరుపేదకు లేదా ఆపన్నుడికి దానం చేయాలి. రావిచెట్టు దిగువన గానుగ నూనెతో దీపం వెలిగించాలి. వరుసగా ఐదు శనివారాలు ఇలా చేస్తే శనిదోషం నుంచి విముక్తులవుతారు. 


Also read: Astrology Tips: నవగ్రహ దోషాల నుండి విముక్తి పొందాలంటే.. ఈ చెట్ల వేర్లను ధరించండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook