Shani Amavasya 2022 Special Yogam: భాద్రపద మాసం అమావాస్య ఆగస్టు 27, శనివారం వస్తుంది. ఈ అమావాస్య శనివారం వస్తుంది కాబట్టి దీనిని శనిశ్చరి అమావాస్య లేదా శని అమావాస్య అంటారు. ఈ శనిశ్చరి అమావాస్య (Shanichari Amavasya) రోజున 14 సంవత్సరాల తర్వాత ప్రత్యేక యాదృచ్చికం ఏర్పడుతుంది. మళ్లీ ఈ యాదృచ్చికం రెండు సంవత్సరాల తర్వాత అంటే 2025లో ఏర్పడుతుంది. హిందూమతంలో భాద్రపద అమావాస్యను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది శనివారం రావడం వల్ల దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరుదైన యాదృచ్ఛికం
ఈ భాద్రపద అమావాస్య మరో అరుదైన యాదృచ్ఛికం ఏర్పడబోతుంది. ఇది శనివారం వచ్చింది, ఈ రోజున శనిదేవుడిని పూజిస్తారు మరియు  శనిగ్రహం దాని సొంతరాశి అయిన మకరరాశిలో ఉంటుంది. శనిదేవుడి ఆగ్రహం తగ్గించడానికి ఈ రోజు చాలా మంచిది. శని సాడే సతి లేదా ధైయాతో బాధపడేవారు ఈ శని అమావాస్య రోజున కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శని మహాదశ యొక్క అశుభ ప్రభావం తగ్గుతుంది. ప్రస్తుతం ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో శని సాడేసతి కొనసాగుతోంది. అదే సమయంలో మిథునం, తులారాశి వారిపై శని ధైయా ప్రభావం ఉంటుంది. 


శని దేవుడిని ప్రసన్నం చేసుకునే పరిహారాలు
>> శనిశ్చరి అమావాస్య రోజున శని దేవుడికి ఆవాల నూనె సమర్పించండి. అలాగే నల్ల నువ్వులు, నల్ల ఉరద్, నల్లని వస్త్రాలు దానం చేయండి.
>> శని అమావాస్యకు ఒకరోజు ముందు అంటే శుక్రవారం నాడు నల్ల బట్టలో ఒకటిన్నర పావు నల్ల ఉల్లి పప్పు కట్టాలి. అప్పుడు దానిని మీ తల కింద పెట్టుకుని నిద్రపోవాలి. అమావాస్య రోజు ఆ మూటను శని ఆలయంలో ఇవ్వండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి యెుక్క దుష్ర్రభావాలు తగ్గుతాయి. 
>>  శని మహాదశ నుండి ఉపశమనం పొందడానికి, శనిశ్చరి అమావాస్య రోజున ఒక కంచు గిన్నెలో ఆవాల నూనె తీసుకొని అందులో నాణెం వేయండి. తర్వాత అందులో మీ ముఖాన్ని చూసి నూనెతో ఉన్న గిన్నెను శని ఆలయంలో ఉంచండి. 


Also Read: Festivals in September 2022: సెప్టెంబర్‌లో రానున్న పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook