Dream Science: కలలో `షిట్` కనిపిస్తే.. శుభమా? అశుభమా! తప్పక తెలుసుకోవాల్సిన విషయం
Shit Dream Science, Meaning of dirty toilet bowl in dreams. కొన్నిసార్లు ఎవరైనా కలలో మలాన్ని (Shit) చూసి ఉంటే.. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు త్వరలోనే ధనవంతులు అవుతారట.
If you see a dirty toilet in your dream It is Good or Bad: ప్రతి వ్యక్తికి కలలు రావటమనేది సహజం. ఒక వ్యక్తి రాత్రి లేదా పగలు ఘాడ నిద్రలో ఉన్నప్పుడు పలు రకాల కలలు వస్తాయి. కొన్ని కలలు మనకు గుర్తు ఉంటే.. కొన్ని అస్సలు గుర్తు ఉండవు. ఇంకొన్ని కలలు సగంలో ఆగిపోతాయి. మనకు వచ్చే కొన్ని కలలు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తే.. మరికొన్ని మాత్రం భయానకంగా ఉంటాయి. అయితే ఒక వ్యక్తి భావోద్వేగాలకు అనుకూలంగానే.. వారికి కలలు రావడం జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక కలలు మన భవిషత్తులో రాబోయే ఆపదలను ముందుగానే చూపిస్తాయని కలల శాస్త్రం చెబుతోంది.
కలల శాస్త్రం ప్రకారం... ప్రతి మంచి మరియు చెడు కలలకు వేర్వేరు అర్థాలు ఉంటాయట. ప్రతి కల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని సూచనలను ముందే ఇస్తుంది. ఈ రోజు మనం ఓ కల గురించి చూద్దాం. అయితే ఈ కల గురించి ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడరు. కొన్నిసార్లు ఎవరైనా కలలో మలాన్ని (Shit) చూసి ఉంటే.. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు త్వరలోనే ధనవంతులు అవుతారట.
మలవిసర్జన చేయడం:
స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో మలవిసర్జన చేయడం కూడా శుభ సంకేతాన్ని సూచిస్తుంది. అలాంటి కల మీకు వస్తే.. మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్ధం. వ్యాపార రంగంలో పురోగతి ఉంటుంది.
షిట్ మీద కాలు పడితే:
మీరు కలలో ఎక్కడికైనా వెళుతున్నపుడు మీ పాదం మలం (Shit) మీద పడితే.. అది శుభ సంకేతాన్ని సూచిస్తుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. భవిష్యత్తులో సంపద మీ దరికి చేరుతుంది.
మలం కనిపిస్తే:
కలలో మీ చుట్టూ మలం కనిపిస్తే.. అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ధన లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి.
శుభ్రపరుస్తున్నట్లు చూస్తే:
కలలో ఎవరైనా మలాన్ని శుభ్రపరుస్తున్నట్లు మీరు చూస్తే మాత్రం అది అశుభం. ఇలా కలలు కనడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధన నష్టం ఉంటుంది.
తినడం చూస్తే:
మీరు కలలో ఏ జంతువైనా లేదా మరేదైనా మలం తినడం చూస్తే.. అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కార్యాలయంలో రకాల సమస్యలు మొదలవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.