Unlucky Zodiac Signs in Sawan Month: శివభక్తులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో చేసే పూజలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మహాదేవుడు ప్రసన్నం అవుతాడు.  ఈసారి శ్రావణ మాసం రెండు నెలలపాటు ఉండనుంది. ఇందులో ఎనిమిది శ్రావణ సోమవారాలు రానున్నాయి. ఈ మాసం జూలై 04 నుండి ప్రారంభం కానుంది. శ్రావణ మాసం కొన్ని రాశులవారికి ప్రతికూలంగా ఉండనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి
శ్రావణ మాసం కుంభరాశి వారికి అశుభకరంగా ఉండనుంది. ఈ రెండు నెలల్లో మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. మీ కెరీర్ ఒడిదుడుకులకు లోనై అవకాశం ఉంది. ఈసమయంలో కుంభరాశి వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో అనేక సమస్యలను ఎదుర్కోంటారు. 
మకరరాశి
మకర రాశి వారికి శ్రావణ మాసం కష్టాలను పెంచుతుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఖర్చులు తగ్గించుకోండి.  ఎందులోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోండి. 
వృషభం
వృషభ రాశి వారికి శ్రావణ మాసం చాలా బాధను కలిగిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోండి.. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కోంటారు.


Also read: Mangal Gochar 2023: జూలై 01న అంగారకుడి సంచారం.. ఈరాశుల జీవితాల్లో తుఫాన్ ఖాయం..


తులారాశి
శ్రావణ మాసం తుల రాశి వారికి ప్రత్యేకంగా ఉండదు. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. కుటుంబంలో గొడవలు వస్తాయి. మీరు వ్యాపారంలో భారీ నష్టాలను చవిచూస్తారు. ఉద్యోగంలో సమస్యలు పెరుగుతాయి. మీ కెరీర్ అనేక ఒడిదుడుకులకు లోనవుతుంది.


Also Read: Guru Gochar 2023: ఈ 3 రాశులపై గురుడు శుభ దృష్టి.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook