Ganesh Chaturthi 2022: ఇవాళ అంటే ఆగస్టు 1 శ్రావణ శుక్ల పక్ష చతుర్థి. ఈ చతుర్థిని వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి (Ganesh Chaturthi 2022) అని కూడా అంటారు. అంతేకాకుండా ఈ రోజు శ్రావణ మాసం మూడో సోమవారం. ఈ రోజున వినాయకుడిని పూజించటం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. వినాయకుడి ఆరాధన లేకుండా హిందూ మతంలో ఏ శుభకార్యం పూర్తి కాదు. ఏ శుభకార్యం జరిగినా లేదా పండుగ జరిగినా ముందుగా గణపతిని పూజించడం అనవాయితీ. మరే ఇతర దేవతలకు ఇంత ప్రాధాన్యత లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా పూజించండి
ప్రతి సంవత్సరం చతుర్థి తిథి నాడు వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రావణ చతుర్థి నాడు పూజలు చేస్తే ఆ ఫలితం ఇంకా అనేక రెట్లు ఉంటుంది. పూజను ప్రారంభించే ముందు ''గజాననం భూత గణాది సేవితం కపిత జంభు ఫలసార భక్షం | ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం'' || అనే మంత్రంతో మనసులో ధ్యానించండి. దీని తరువాత 'ఓం గంగా గణపతయే నమః' మంత్రాన్ని జపమాలతో జపించండి.  దీనిని నిరంతరం పాటిస్తే భగవంతుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అంతే కాకుండా గణేష్ గాయత్రీ మహామంత్రం 'ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమః తన్నో బుద్ధ ప్రచోదయాత్' కూడా చాలా ఫలవంతమైనది. ఈసారి శ్రావణ శుక్ల పక్షం సోమవారం నాడు గణేష్ చతుర్థి వస్తోంది. కాబట్టి ఈ రోజున శివుడికి రుద్రాభిషేకం చేస్తే భక్తులు మెుక్కలు తీర్చుతాడు. 


Also Read: Shani Mahadasha: శని మహాదశ నుండి బయటపడాలంటే.. శ్రావణ శనివారం ఈ చిన్న పని చేయండి చాలు!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook