Sawan Somwar Vrat 2022: ఈరోజు అంటే శ్రావణ మాసం మూడో సోమవారం. ఇవాళ భక్తులు శివారాధన చేస్తారు. దంపతులకు సంతానం కలగాలన్నా, వివాహంలో అడ్డంకులు తొలగిపోవాలన్నా ఈరోజున మహాదేవుడ్ని పూజించడం మంచిది. యాదృచ్ఛికంగా ఈ రోజే శ్రావణ శుక్ల పక్ష చతుర్థి కూడా. ఈ రోజున వినాయకుడి చతుర్థి (Ganesh Chaturthi 2022) జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల మీ జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ రోజు రవియోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగంలో పూజలు చేస్తే మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. శ్రావణ మూడో సోమవారం (Shravana Somavaram Vrat 2022) తిథి, శుభ యోగం ముహూర్తం మరియు పూజా విధానం గురించి తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుభ ముహూర్తం
శ్రావణ మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తేదీ ఈరోజు ఆగస్టు 01 తెల్లవారుజామున 04:18 గంటల నుండి ఆగస్టు 02 ఉదయం 05:13 వరకు ఉంటుంది. ఉదయతిథి ప్రకారం ఈ రోజున వినాయక చతుర్థి పాటిస్తారు. ఇవాళ శ్రావణ మూడో సోమవారం కాబట్టి శివారాధనకు ముహూర్తం అవసరం లేదు. ఈరోజు ఉదయం 05:42 నుండి రవియోగం (Ravi Yogam) ప్రారంభమై.. సాయంత్రం 04:06 వరకు ఉంటుంది. ఈ సమయంలో శివపూజ చేయడం ఉత్తమం. వినాయక చతుర్థి వ్రతం ఉండాలనుకునే వారు ఉదయం 11.06 నుండి మధ్యాహ్నం 01.48 గంటల మధ్య వినాయకుడిని పూజించవచ్చు. 


శ్రావణ సోమవారం పూజా విధానం
మీరు శ్రావణ సోమవారం ఉపవాసం ఉంటే.. ఉదయం స్నానం చేసిన తర్వాత తెలుపు లేదా ఆకుపచ్చ బట్టలు ధరించండి. ఈ రెండు రంగులు శివునికి ప్రీతిపాత్రమైనవి. ఈరోజు ఏదైనా శివాలయంలో లేదా ఇంట్లోనే శివలింగాన్ని పూజించండి. శివునికి జలాభిషేకం చేయండి. తర్వాత పాలతో అభిషేకం చేసి చందనాన్ని పూయాలి. అనంతరం శివునికి  తెల్లని పూలు, ధూపం, దాతురా, బెల్లపు ఆకులు, పండ్లు, తేనె మెుదలైన వాటిని సమర్పించండి. ఓం నమః శివాయ జపంతో శివ చాలీసా పఠించండి. అంతేకాకుండా ఈ వ్రత కథను చదవి వినిపించండి. చివరగా హారతిని ఇచ్చి... ప్రసాదాన్ని అందరికీ పంచండి.  


Also Read: Naga Panchami Date: నాగపంచమి తేదీ, పూజా సమయం ఎప్పుడు, ఏం చేయకూడదు 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook