Rajyogam: `లక్ష్మీనారాయణ యోగం` చేస్తున్న బుధుడు-శుక్రుడు.. ఈ రాశులపై కనకవర్షం..
Lakshmi Narayan Yog: వేద పంచాంగం ప్రకారం, మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు కలయిక ఉండబోతోంది. దీని వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం 3 రాశుల వారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది.
Lakshmi Narayana Yogam benefits: జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు తమ రాశులను మార్చడం ద్వారా ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు, బుద్దిని ఇచ్చే బుధుడు కలయిక ఈ నెలలో జరగబోతుంది. ఈరెండు గ్రహాల సంయోగం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం ఏయే రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
లక్ష్మీనారాయణ యోగం ఈ రాశులకు వరం
సింహ రాశి
లక్ష్మీ నారాయణ యోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా మీకు ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు. ఫారిన్ లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
కర్కాటం
రాజయోగం కారణగా కర్కాటక రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. జాబ్ కోసం ప్రయత్నించే వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
మిథునం
బుధుడు మరియు శుక్రుడి కలయిక మీకు కలిసి వస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి 11వ ఇంట్లో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. పాతపెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారం సజావుగా నడుస్తుంది. మీరు షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల భారీగా ప్రయోజనం పొందుతారు.
Also read: Three Rajyog effect: 617 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక.. ఈ రాశుల దశ తిరగడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.