Shukra Gochar 2023: ప్రేమ, రొమాన్స్, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు.  వచ్చే నెల 07న తెల్లవారుజామున 3.59 గంటలకు శుక్రుడు కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి వెళ్లబోతున్నాడు. ఆ తర్వాత అదే రాశిలో శుక్రుడు జూలై 23న ఉదయం 6:01 గంటలకు తిరోగమనం చెందుతాడు. మళ్లీ ఆగస్టు 07, ఉదయం కర్కాటక రాశికి తిరిగి వచ్చి..సెప్టెంబర్ 4 వరకు అక్కడే ఉంటాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: 


శుక్రుడి సంచారం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ కెరీర్ బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రేమికుల సంబంధాలు బలపడతాయి. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు. 


వృషభం:


ఈరాశి వారికి శుక్ర సంచారం అనుకూలంగా ఉండనుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. 


మిథునరాశి:


 శుక్రుని రాశి మార్పు మీకు కలిసి వస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి ఆఫీసులో ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. 


కర్కాటకం: 


కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటరు. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీ మాటలతో ప్రజల హృదయాలను గెలుచుకుంటారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 


Also Read: Chandra Gochar 2023: నేటి నుండి మూడు రోజులపాటు ఈరాశుల ఇళ్లపై డబ్బు వర్షం... మీరున్నారా?


సింహ రాశి: 


ఈ సమయం సింహ రాశికి అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. 


కన్యా రాశి:


దేశవిదేశాలలో పని చేసే ఈ రాశి వ్యక్తులకు మేలు జరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. తన అభిరుచుల కోసం ఖర్చు చేస్తారు. 


తుల రాశి:


శుక్ర సంచారం తులారాశికి మంచిది. వీరి ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ పెరుగుతుంది. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడం లాభాలను ఇస్తుంది.


Also Read: Sun transit 2023: ఈ రోజు నుండి ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి