Hans And Malavya Rajyog:  ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. లవ్, రొమాన్స్, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. అందుకే ఎవరి జాతకంలో శుక్రుడు బలమైన స్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఈరాశిలో శుక్రుడు ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. దీని  కారణంగా అరుదైన మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇప్పటికే బృహస్పతి అదే రాశిలో హన్స్ రాజయోగాన్ని సృష్టించాడు. ఈరెండు యోగాల కారణంగా కొందరికి మంచి రోజులు రానున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం
మాలవ్య మరియు హన్స్ రాజయోగాలు మిథునరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు ధనలాభం ఉంది. ఉద్యోగులు ఆఫీసులో కొత్త బాధ్యతలను తీసుకుంటారు. జాబ్ చేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 
కన్య 
మాలవ్య రాజయోగంగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యోగం మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో మీ వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారులు పెద్ద డీల్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 
ధనుస్సు 
శుక్రుడి కారణంగా ఏర్పడిన రాజయోగం వల్ల ధనుస్సు రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీపై శనిదేవుని అనుగ్రహం ఉంటుంది. 


Also Read: Surya-Mangal: మరో 6 రోజుల్లో ఈరాశులకు అనుకోకుండా ధనం.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook