Shukra transit 2023: రాబోయే 27 రోజులు ఈ 5 రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీ రాశి ఉందా?
Shukra Gochar 2023: మే 02న శుక్రుడు తన సొంత రాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు రాశి మార్పు కారణంగా 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Rashi Parivartan 2023: నిన్ననే శుక్రుడు తన రాశిని ఛేంజ్ చేశాడు. వృషభరాశి నుండి మిథునరాశిలోకి ప్రవేశించాడు. మే 30 వరకు శుక్రుడు మిథునరాశిలో ఉండి.. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథునరాశిలో శుక్రుడు సంచారం వల్ల 5 రాశులవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషరాశి- మిథునరాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మేష రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. వీరు చాలా డబ్బును పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి సాధిస్తారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు. మీ జీవితంలో ఆనందం తాండవిస్తోంది.
మిథునరాశి- శుక్రుడు ఇదే రాశిలో సంచరిస్తున్నాడు. మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. అనుకున్న సమయానికి మీ పనులు పూర్తవుతాయి.
సింహ రాశి- శుక్రుని రాశి మార్పు కూడా సింహ రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు పరీక్ష-ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీ బాస్ సపోర్టు మీకు లభిస్తుంది. పాలిటిక్స్ లో ఉన్నవారు మంచి ప్రయోజనాలు పొందుతారు.
Also Read: Surya Budh Yuti 2023: బుధాదిత్య యోగంతో ఈ రాశులకు పండగే పండుగ.. డబ్బే డబ్బు..
తులా రాశి- తులారాశికి శుక్రుడు అధిపతి. ఈ శుక్ర సంచారం తులారాశి వారికి మంచి ప్రయోజనాలను ఇవ్వనుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆస్తి ద్వారా ప్రయోజనం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయ. మీరు కోరుకున్నది లభిస్తుంది.
మీనం - శుక్రుడి రాశి మార్పు మీకు మంచి ప్రయోజనాలను అందించనుంది. వ్యాపారులు మంచి లాభాలను ఆర్జిస్తారు. మీరు సంతోషకరమైన వార్తలు వింటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. మీ లైఫ్ లో సంతోషం, ఐశ్వర్యం రెండూ పెరుగుతాయి.
Also Read: Surya Guru Yuti 2023: మేషరాశిలో అరుదైన సంయోగం.. ఈ 3 రాశుల వారికి ప్రయోజనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook