Venus Nakshatra transit: 2024లో కింగ్ లాంటి జీవితాన్ని గడపబోయే రాశులివే..!
Shukra Nakshatra Gochar 2024: డిసెంబరు చివరిలో శుక్రుడు తన నక్షత్రాన్ని మార్చనున్నాడు. దీని కారణంగా కొత్త సంవత్సరంలో మూడు రాశుల ఫేట్ మారనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Venus Nakshatra transit 2024: పురాణాల ప్రకారం, శుక్రుడు లేదా శుక్రాచార్యుడిని రాక్షసుల గురువుగా భావిస్తారు. ఇతడి పేరు మీద శుక్ర గ్రహం ఉంది. ఆస్ట్రాలజీ ప్రకారం, ఇతడిని డబ్బు, లగ్జరీ లైఫ్, లవ్, రొమాన్స్ కు కారకుడిగా భావిస్తారు. ఈ నెల చివరిలో శుక్రుడు వృశ్చికరాశిలో ప్రవేశిస్తున్నాడు. అదే రాశిలో ఉండగానే.. డిసెంబర్ 28వ తేదీ మధ్యాహ్నం 1:02 గంటలకు అనూరాధ నక్షత్రంలోకి వెళ్లనున్నాడు శుక్రుడు. ఇదే నక్షత్రంలో శుక్రుడు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకు ఉంటాడు. అనూరాధ నక్షత్రానికి అధిపతిగా శనిదేవుడిని భావిస్తారు. శని నక్షత్రంలో శుక్రుడి సంచారం ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
సింహం: శుక్రుని రాశి మార్పు సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీకు ఇష్టమైన వారితో మంచి సమయం గడుపుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీరు లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వృషభం: అనూరాధ నక్షత్రంలో శుక్రుడు సంచారం వృషభరాశి వారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. మీ దాంపత్య జీవితంలో గొడవలన్నీ తొలగిపోతాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ లవ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
కర్కాటకం: శుక్రుడి నక్షత్ర మార్పు కర్కాటక రాశి వారి జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ బ్యాంక్ బ్యాలెస్స్ పెరుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.
Also Read: Surya Gochar 2023: డిసెంబర్ 16 నుంచి ఈ 4 రాశుల దశ తిరగబోతుంది.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి