Shukra Gochar In Leo: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మారుస్తాయి. ఈ నెలలో కూడా కొన్ని గ్రహాలు తమ రాశులను మార్చాయి. సంపద, ఐశ్వర్యం, అందం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. జూలై 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. అతడు ఆగస్టు 07 వరకు అదే రాశిలో ఉండనున్నాడు. శుక్రుడి రాశి మార్పు కారణంగా మూడు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్ర సంచారం ఈ 3 రాశులకు వరం
మిధునరాశి
మిథునరాశి వారికి శుక్రుడి గోచారం చాలా లాభాలను ఇస్తుంది. మీ రాశిచక్రం యొక్క మూడవ ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. ఈ రాశిచక్రంలోని ఐదవ మరియు 12వ ఇంటికి శుక్రుడు అధిపతి. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. బిజినెస్ లో మంచి పురోగతి ఉంటుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
కుంభరాశి
శుక్రుని సంచారం కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఈ రాశి యెుక్క ఏడో ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో ఆగస్టు 07 వరకు బోలెడంత డబ్బు సంపాదించనున్నారు. మీకు లక్ కలిసి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. 
తులారాశి
ఈ రాశుల వారికి శుక్రుని సంచారం అనుకూలంగా ఉంటుంది.ఈ రాశి వారి ఆదాయ గృహంలో ఈ సంచారం జరుగబోతుంది.  మీ ఆదాయం పెరుగుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. మీరు కెరీర్ లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పాతపెట్టుబడులు లాభాస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


Also Read: Kendra Trikon Rajyog 2023: ఆ రెండు రాశుల కలయికతో కేంద్ర త్రిభుజం రాజయోగం, ఇక ఈ రాశులవారికి లాభాలే లాభాలు