Shukra Gochar 2022: ఈ 5 రాశులకు లక్ మామూలుగా లేదు.. ఆగస్ట్ 31 నుండి ఈ రాశులకు డబ్బే డబ్బు!
Shukra Gochar 2022: శుక్రుడు మరో ఆరు రోజుల్లో తన రాశిని మార్చబోతున్నాడు. దీని సంచారం 5 రాశులవారికి లాభాలను తెస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2022: ప్రేమ, శృంగారం, భౌతిక సుఖాలు, అందానికి కారుకుడు.. శుక్రుడు. ఆస్ట్రాలజీ ప్రకారం, ఆగస్టు 31 శుక్రుడు సింహరాశిలోకి (Venus Transit in leo 2022) ప్రవేశించనున్నాడు. శుక్రుడు రాశి మార్పు కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశులకు శుభప్రదం
తుల రాశి (Libra): ఆస్ట్రాలజీ ప్రకారం, తుల రాశికి అధిపతి శుక్రుడు మరియు ఈ రాశి యెుక్క 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. శుక్రుని సంచారం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు.
వృషభం (Taurus): వృషభ రాశిలోని నాల్గవ ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. ఈ రాశిచక్రాన్ని పాలించే గ్రహం కూడా శుక్రుడు. దీంతో శుక్రుని సంచార ఈ రాశివారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు శాంతిని తీసుకొస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అదృష్టంతో వీరు అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. మొత్తం మీద ఈ సంచారం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది.
కుంభ రాశి (Aquarius): కుంభ రాశిలోని 7వ ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. శుక్రుని యొక్క ఈ సంచారము ఈ రాశివారికి చాలా మేలు చేస్తుంది. కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
సింహం (Leo): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశిచక్రం యొక్క లగ్న గృహంలో శుక్రుని సంచారం జరుగుతుంది. దీంతో పాటు, ఈ రాశిలో శుక్రుడు మరియు సూర్యుని కలయిక కూడా ఏర్పడుతుంది. శుక్ర సంచార ప్రభావం వల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు వస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio): ఈ రాశిచక్రంలోని 10వ ఇంట్లో శుక్రుడు సంచరిస్తున్నాడు. కెరీర్ లో పురోగతిపాటు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. వ్యాపారులు భారీగా లాభాలు ఆర్జిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ లక్ కలిసి వస్తుంది.
Also Read: Ganesh Chaturthi 2022: వినాయకుడి ఫేవరెట్ రాశులేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook