Venus Planet Transit In Mesh 2023:  రాక్షసుల గురువైన శుక్రుడి గమనంలో పెనుమార్పు రానుంది. ఎందుకంటే శుక్రుడిని సంపద, కీర్తి, ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. మార్చి 12న శుక్ర గ్రహం మేషరాశిలో  సంచరించబోతుంది. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. శుక్రుడి రాశి మార్పు ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేష రాశిచక్రం
మేష రాశి వారికి శుక్రుని సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశిలో రాహువు మరియు శుక్రుడు కలయిక జరగబోతుంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది.  మీ లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. మీకు డబ్బు రాక మెుదలవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది.
మిథున రాశిచక్రం
శుక్రుని సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.  ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి ఆదాయ గృహంలో సంచరిస్తున్నాడు. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. విదేశీ వ్యాపారం నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మీకు ఆద్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అంతులేని ఐశ్వర్యం లబిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. 
మకర రాశిచక్రం
శుక్రుని రాశి మార్పు మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో శుక్ర గ్రహం కేంద్ర త్రికోణ రాజయోగాన్ని చేస్తోంది. అందుకే ఈ సమయంలో మీ అదృష్టం పెరుగుతుంది. దీంతోపాటు మీ పురోగతికి మార్గం తెరుచుకుంటుంది. ఏదైనా లగ్జరీ వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.


Also Read: Five Rajyog: 700 ఏళ్ల తర్వాత 5 ఆరుదైన రాజయోగాలు.. ఈ 4 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook