COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Venus Transit In Cancer: గ్రహాల, రాశుల పరంగా ఆగస్టు నెల ఎంతో కీలకమైనది. ఈ నెలలో చాలా ముఖ్యమైన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగబోతున్నాయి. అయితే ఈ ఆగస్ట్ 7 తేదిన శుక్రుడు తిరోగమన దశలో సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావం కారణంగా ఆగస్టు నెల నుంచి సెప్టెంబర్‌ నెల వరకు కొన్ని రాశులవారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ తిరోగమనం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం:
కన్యారాశి:

శుక్రుని సంచారం కారణంగా కన్యారాశివారిపై విపరీతమన చండాల ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి పనులు చేసిన తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. విద్యార్థులకు విద్యాపరమైన ఆటంకాలు ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపారాలు చేస్తున్నవారు పెట్టుబడులకు దూరంగా ఉండడం చాలా మంచిది.


Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..


కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి శుక్రుడి సంచారంతో చాలా అశుభ పరిణామాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కుటుంబ వివాదాలు కూడా వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేవారికి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. వైవాహిక సంబంధాలలో తీవ్ర సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


సింహ రాశి:
సింహ రాశి వారు ఈ నెల మొత్తం పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర నష్టాలకు గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పెట్టబడులు పెట్టేవారు జాగ్రత్తలు పాటించకపోతే ఆర్థిక నష్టాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు ఒత్తి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కడుపు, హార్మోన్లు, ఛాతీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.  


Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook