Shukra Grah Gochar in Taurus on 06th April 2023:  జ్యోతిషశాస్త్రంలో శుక్రుడి సంచారం చాలా ముఖ్యమైనది. ఐశ్వర్యం, ప్రేమ, ఆకర్షణ మరియు అందం యెుక్క దేవుడిగా శుక్రుడిని భావిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడి బలంగా ఉంటాడో వారికి దేనికీ లోటు  ఉండదు. అంతేకాకుండా వీరు సర్వసుఖాలను పొందుతారు. ఏప్రిల్ 06న శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శుక్రుడి రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారు అపారమైన ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ  రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు వరం


వృషభం
వృషభ రాశి వారికి శుక్ర సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా శుక్రుని సంచారం మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. బిజినెస్ మెుదలుపెట్టడానికి ఇదే అనుకూల సమయం.


కర్కాటకం
కర్కాటక రాశి వారికి శుక్రుని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి శుభ యోగం కలుగుతోంది. మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ప్రత్యర్థులతో పోటీ పడి మరి విజయం సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 


కన్య
కన్యా రాశి వారికి శుక్రుని సంచారం వల్ల ప్రయోజనం కలుగుతుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మీరు భారీగా డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ దక్కుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. 


మకరరాశి
శుక్రుడి గోచారం వల్ల మీరు అనుకూల ఫలితాలను పొందుతారు. మీరు ప్రతి రంగంలోనూ రాణిస్తారు. మీరు చాలా డబ్బు పొందుతారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వ్యాపారులకు ఈ సమయం బాగుంటుంది. శుక్ర మహారాజు అనుకూల ప్రభావం వల్ల మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. 


Also Read: Shukra Gochar 2023: వృషభరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం..


Also Read: TSRTC: భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. రూ.116 చెల్లిస్తే నేరుగా మీ ఇంటికే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి