Venus Margi 2023 in Cancer: గ్రహాలు కాలానుగుణగా ఉదయించడం, అస్తమించడం, సంచరించడం లేదా తిరోగమించడం చేస్తాయి. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు సెప్టెంబరు 04న కర్కాటక రాశిలో నేరుగా నడవడం మెుదలుపెట్టాడు. ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఇప్పటివరకు తిరోగమనంలో ఉన్న శుక్రుడు ప్రత్యక్షంగా సంచరించనున్నాడు. శుక్రుడు సంచారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ 3 రాశులకు వరం
తులారాశి
శుక్రుడి సంచారం తులరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఇస్తుంది. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. 
మిధునరాశి
కర్కాటక రాశిలో శుక్రుడు ప్రత్యక్ష సంచారం మిథునరాశి వారికి మేలు చేస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం కలిసి వస్తుంది. 
కన్యా రాశి
శుక్రుడి గమనంలో మార్పు కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడి మీకు భారీగా లాభాలను ఇస్తుంది. బిజినెస్ చేసేవారికి ఈ సమయం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు పెద్ద మెుత్తంలో ధనాన్ని ఆర్జిస్తారు. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. 


Also Read: Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లలో రెమ్యూనరేషన్ ఎవరికి ఎక్కువంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook