Shukra Rashi Parivartan 2023: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. శుక్రుడు సంచారం చేయడం వల్ల చాలా రాశులవారిపై ప్రభావం పడుతుందని అందరికీ తెలిసిందే. అయితే మే 30వ తేదిన శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రభావంతో  'కర్కో భవ నాశయతి' అనే పరిస్థితులు కూడా ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ పదానికి ఆర్థం...'భవ' అంటే ఇల్లు, నాశయతి అంటే నాశనమని..శుక్రుడు కర్కాటకరాశిలో సంచరం చేయడం వల్ల ఇంటిలో చాలా రకాల సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహ సంచారం ఏయే రాశివారిపై పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారిపై ప్రభావం:
కర్కాటక రాశి:

కర్కాటక రాశివారికి శుక్ర గ్రహ ప్రభావం తీవ్రంగా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శుక్రుడు ఈ రాశివారికి 11వ స్థానంలో ఉండబోతోంది. కాబట్టి కర్కాటక రాశివారికి ఈ క్రమంలో చాలా రకాల ఆర్థిక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా సామాజికంగా కూడా తీవ్రంగా దెబ్బతింటారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులు రావొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 
 
వైవాహిక జీవితంలో అస్థిర పరిస్థితుల పట్ల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మీ జీవిత భాగస్వామికి మధ్య వివాదాలు రావొచ్చు..కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


మకర రాశి:
ఈ శుక్ర గ్రహ సంచారం మకర రాశివారిపై కూడా తీవ్రంగా పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారికి శుక్రుడు 10వ స్థానంలో అధిపతి దశలో ఉన్నాడు. కాబట్టి మకర రాశివారి వైవాహిక జీవితంలో తీవ్ర విభేదాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.