Shukra Gochar 2023: మే 30న కర్కాటకరాశిలో శుక్రుడు.. కుంభ, మీన రాశులపై దాని ప్రభావం..
Venus transit 2023: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని ఛేంజ్ చేయనున్నాడు. ప్రస్తుతం శుక్రుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం వల్ల ఏ రాశులు ప్రభావితమవుతాయో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: బ్యూటీ, లవ్, రొమాన్స్ మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. శుక్రదేవుడిని రాక్షసుల గురువు అంటారు. ఇతడు మీనరాశిలో ఉచ్ఛ స్థితిలోనూ, కన్యారాశిలో నీచ స్థితిలోనూ ఉంటాడు. ప్రస్తుతం శుక్రుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. ఈనెల 30, రాత్రి 7:39 గంటలకు శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. పంచాంగ ప్రకారం, శుక్రుడు జూలై 7, 2023 ఉదయం 3:59 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. అనంతరం సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. కర్కాటకంలో శుక్ర సంచారం రాశులపై ఎటువంటి ప్రభావం చూపుతుదో తెలుసుకుందాం.
మీనరాశి
శుక్రుడు ఈరాశి యెుక్క ఐదో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మీరు ప్రేమలో పడే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.
కుంభ రాశి
కర్కాటక రాశిలో శుక్రుని సంచారం ఆరో ఇంట్లో జరగబోతుంది. దీని కారణంగా మీరు ఉద్యోగంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నే అవకాశం ఉంది. ఆహారాన్ని మితంగా తినండి. వ్యాయామం చేయడం మంచిది. ఆస్తి వివాదాలు ఎదుర్కోనే అవకాశం ఉంది. శుక్ర గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కుంభరాశి వారు చిన్నారుల పాదాలను తాకి వారి ఆశీస్సులు తీసుకోవాలి.
Also Read: Mars Transit 2023: కర్కాటక రాశిలో అంగారకుడి సంచారం, ఈ రాశులవారిపై దరిద్ర యోగం ప్రభావం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook