Venus transit 2022: మకరరాశిలో శుక్రుడి ప్రవేశం... ఈ 4 రాశులవారు జాగ్రత్త..
Venus transit in Capricorn 2022: మరో ఆరు రోజుల్లో శుక్రుడు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది ఏ రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Venus transit in Capricorn 2022: లవ్, రొమాన్స్, ఆనందం మరియు లగ్జరీ లైఫ్ కారకుడైన శుక్రుడు.. డిసెంబరు 29వ తేదీ, గురువారం మధ్యాహ్నం 3.47 గంటలకు మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడు 29 డిసెంబర్ 2022 నుండి 21 జనవరి 2023 వరకు మకరరాశిలో ఉంటాడు. కొత్త ఏడాదిలో శుక్ర సంచారం (Venus transit in Capricorn 2022) కొన్ని రాశులవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. శుక్రుడి రాశి మార్పు ఏ రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
మిథునం (Gemini): శుక్రుని సంచారం మిథున రాశివారి ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీ ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో మీకు నిద్ర సరిగా పట్టదు. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు వస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు అనేక వ్యాధుల బారిన పడతారు. ఆర్థిక పరిస్థితి కూడా అంతగా బాగోదు.
కర్కాటకం (Cancer): శుక్రుడు కర్కాటక రాశిలోని ఏడవ ఇంటిలో సంచరిస్తున్నాడు. దీంతో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ కెరీర్ లో అనేక ఇబ్బందులకు గురవుతారు. కుటుంబ జీవితం కూడా ప్రభావితం అవుతుంది. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. బిజినెస్ లో భాగస్వాముల మధ్య మనస్పర్ధలు అవుతాయి.
వృశ్చిక రాశి(Scorpio): వృశ్చిక రాశిపై శుక్రుడి అశుభ ప్రభావం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి ప్రభావితం అవుతుంది. ఆర్థిక విషయాలు మీకు అంతగా కలిసిరాదు. కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగం మారాలనుకునేవారికి ఈ సమయం అంతగా కలిసిరాదు.
ధనుస్సు (Sagittarius): శుక్రుని సంచారం వల్ల మీరు చాలా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో సహోద్యోగులు, ఉన్నతాధికారుల మద్దతు మీకు లభించదు. వ్యాపారులు అనుకున్న విధంగా సక్సెస్ కాలేరు. మెుత్తానికి ఈ సమయం మీకు చాలా కఠినంగా ఉంటుంది.
Also read: Budhaditya Yoga: బుధాదిత్య యోగం వల్ల ఈ 4 రాశులవారి జాతకం మారిపోనుందట..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.