Shukraditya Rajyog 2024 In Telugu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు చాలా లేటుగా రాశి సంచారం చేస్తుంది. కానీ మరికొన్ని గ్రహాలు మాత్రం ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూనే ఉంటుంది. అలాగే కొన్ని గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేయడం వల్ల ప్రత్యేకమైన, శక్తివంతమైన యోగాలు ఏర్పుడుతూ ఉంటాయి. దీని కారణంగా ఈ యోగాలు శుభ స్థానంలో ఉన్న కొన్ని రాశులవారికిపై ప్రత్యేక ప్రభావం కూడా పడుతుంది. ఇదిలా ఉండగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్రుడు మే 19న వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఇదే సమయంలో వృషభ రాశిలో సూర్యుడు కూడా కలవబోతున్నాడు. ఈ శుక్రుడు, సూర్యుడు కలయిక వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో 3 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అదృష్టం పెరిగి అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. దీంతో పాటు ఇతర లాభాలు కలుగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:
శుక్రాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల మేషరాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కొత్త కాంట్రాక్టులు కూడా లభించే ఛాన్స్‌ ఉంది. వ్యాపారాలన్నీ లాభసాటిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా త్వరలోనే మెరుగుపడతాయి. దీంతో పాటు మేష రాశివారి మాటల్లో మాధుర్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వీరు సంపన్నులు కూడా అవుతారు. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే వీరికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 


వృషభ రాశి:
వృషభ రాశివారిపై కూడా శుక్రాదిత్య రాజయోగం ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఆఫీసుల్లో పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో వీరు కొత్త అవకాశాలు కూడా పొందుతారు. అంతేకాకుండా కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు భాగస్వామ్య జీవితం గడుపుతున్నవారికి సంతోషకరమైన రోజులు పొందుతారు. అలాగే వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవ్వడం కారణంగా కష్టపడి పని చేస్తే అనేక ప్రయోజనాలు పొందుతారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి కూడా ఈ ప్రత్యేకమైన యోగాల కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా నిలిచిపోయిన పనులు కూడా ప్రారంభమవుతాయి. అలాగే వీరికి కొత్త ఆదాయ వనరు కూడా లభిస్తాయి. దీంతో పాటు వీరు పిల్లల నుంచి కూడా కొన్ని శుభవార్తలు వింటారు. అలాగే భవిష్యత్‌కు సంబంధించిన విషయాల్లో కూడా విజయాలు సాధిస్తారు. అలాగే వీరు పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక రకాల లాభాలు పొందుతారు. వ్యాపారం, ఉద్యోగాల్లో వస్తున్న సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి