Bhadrachalam: భద్రాద్రి రామయ్య కల తీరింది.. బంగారు వాకిలి ముందు వెండి వాకిలి వాలింది
Bhardrachalam Silver Poch: దక్షిణాది ప్రాంతంలోనే అరుదైన రాముడి మందిరం మన తెలంగాణలో కొలువైంది. గోదావరి తీరాన భద్రాచలంలో కొలువైన రాములవారి వాకిలో వెండి ద్వారం చేరింది. ఇన్నాళ్లు బంగారు, ఇత్తడి వాకిళ్లు ఉండగా తాజాగా మూడోది వెండి వాకిలి చేరడం విశేషం.
Bhdrachalam Vendi Vakili: గోదావరి ఒడ్డున దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వెండి వాకిలి సిద్ధమైంది. అనేక ప్రత్యేకతలతో రూపొందించిన వెండి వాకిలి దర్శనం ప్రారంభమైంది. ఆలయ అధికారులు వెండిని సేకరించి వాకిలిని తీర్చిదిద్దారు. ఆలయ ప్రవేశంలో మొత్తం మూడు మార్గాలు ఉన్నాయి. వాటిలో ఉచిత దర్శనం దారిలో ఇత్తడి వాకిలి ఉంది. ఇక గర్భగుడికి బంగారు వాకిలి ఎప్పటినుంచో ఉండగా.. వీటి మధ్యలో ఉన్న ముఖ మండపానికి తాజాగా వెండి వాకిలిని ఏర్పాటు చేశారు.
Also Read: Vishnu Idol: కృష్ణా నదిలో ప్రత్యక్షమైన విగ్రహాలు.. అయోధ్య రాముడి రూపంలో శ్రీమహావిష్ణువు, శివలింగం
రెండో ద్వారానికి వెండి తాపడం చేయాలని గతంలో అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా వంద కిలోల వెండితో తాజాగా వాకిలికి వెండి తాపడం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్థపతి దండపాణి సారథ్యంలో ఈ వెండి వాకిలి తయారుచేశారు. ఆలయంలోని తలుపులు, ద్వారాలు, గడప ఉన్న డిజైన్లు, శిల్పాలకు అనుగుణంగా వెండి రూపాన్ని రూపొందించారు. 70 కిలోల ఆలయ వెండికితోడు హైదరాబాద్‌కు చెందిన ఓ దాత 30 కిలోల వెండిని విరాళంగా అందించారు.
మొత్తం వంద కిలోలతో రూపొందించిన వెండి తాపడాన్ని ఇటీవల ఆలయలో అధికారుల సమక్షంలో స్థపతులు అమర్చారు. బుధవారంతో వెండి వాకిలి మొత్తం పూర్తయి భక్తులకు దర్శనమిచ్చింది. వెండి వాకిలిలో దేవతామూర్తుల దర్శనం నేత్రపర్వంగా ఉంది. తోరణంలో దశావతారాలు, ఆళ్వార్లు, హంస తదితర రూపాలు దర్శనమిస్తున్నాయి. చూడచక్కని డిజైన్లతో వెండి ద్వారం భక్తులను ముగ్ధులను చేస్తోంది. ప్రత్యేక జాగ్రత్తలతో ఈ పనులు చేపట్టారు. శ్రీరామనవమి సమీపిస్తున్న సమయంలో వెండి తలుపు సిద్ధమవడం మరింత ప్రత్యేకత తీసుకురానుంది.
'మూడు ద్వారాలకు మూడు రకాల లోహాలతో అలంకరణ చేశాం. భవిష్యత్‌లో భక్తుల సహకారంతో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాం. వెండి వాకిలితో హైదరాబాద్ స్థపతి ప్రత్యేకంగా.. అందంగా రూపొందించారు. ఇప్పుడు మూడు లోహలతో కూడిన ద్వారాల్లో స్వామివారు చక్కగా దర్శనమిస్తున్నారు. శ్రీరామనవమి కోసం ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నాం. వెండి వాకిలితో ఈసారి ఉత్సవాలు మరింత అందంగా జరుగుతాయి' అని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook