Solar Eclipse 2022, Beliefs, Myths, Rituals: భారతీయులకు గ్రహణాలతో విడదీయలేని బంధం ముడిపడి ఉంది. కర్మభూమిగా పిలువబడే భారతావని వేదాలు... పురాణ ఇతిహాసాల కథలు వంటి అంశాలతో పెనవేసుకుంది. వాటిలో భాగమే సూర్య, చంద్ర గహణాలు. సాగరమథన సమయంలో అమృతం వచ్చాక దేవతలు ఓవైపు... రాక్షసులు ఓవైపు కూర్చుని ఉండగా... మోహిణీ రూపంలో శ్రీమహా విష్ణువు దేవతలకు అమృతం... రాక్షసులకు విషం పంచుతుండగా ఇది గమనించిన రాహు, కేతు అనే ఇద్దరు రాక్షసులు మారువేషంలో దేవతల పక్కన కూర్చునగా.. ఇది గమనించిన సూర్యచంద్రులు విష్ణుమూర్తికి కనుసైగ చేయగా... సుదర్శన చక్రంతో వారిని సంహరించారు. అయితే అప్పటికే అమృతం తాగిన వారు అమరులుగా మిగిలిపోవడం.. పగతో సూర్య, చంద్రులను మింగేయడంతో గ్రహణాలు ఏర్పడతాయనేది మైథాలాజికల్ స్టోరీ. ఈనెల 30న సూర్య గ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో గ్రహణం పట్టడంపై సమాజంలో ఉన్న ప్రచారం, విశ్వాసాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహణ కాలంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి...
గ్రహణ కాలంలో వెలువడే అతినీల లోహిత కిరణాల వల్ల మనుషులకు చెడు జరుగుతుందనే వాదనలను పండితులు మొదలు... పామరుల వరకు అంతా నమ్ముతారు. ఇక గ్రహణ కాలంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కొన్ని చేయకూడని పనులను మనవాళ్లు చూపించారు. గ్రామీణ ప్రాంతాలు మొదలు... పట్టణ ప్రాంతాల వరకు గర్భిణీ స్త్రీల విషయంలో పండితుల సలహాలను అంతా పాటిస్తారు. వారు ఇచ్చిన సూచనలు తూ.చ. తప్పకుండా పాటిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 


గ్రహణకాలంలో గర్భిణీలు చేయకూడని పనులు..
అయితే గ్రహణ కాలంలో గర్భిణీ మహిళలు చేయకూడని పనులను ఓసారి పరిశీలిద్దాం. నాలుగు నెలలు దాటిన గర్భిణీలు గ్రహణ కాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని... లేదంటే కడుపులో ఉన్న శిశువుపై చెడు ప్రభావం చూపుతాయని వాదనలు కోకొళ్లలు. గ్రహణ వేదన మొదలు.. గ్రహణం పట్టి విడిచే వరకు గర్భిణీ స్త్రీలు కదలకుండా పడుకోవాలని... ఎలాంటి కుట్లు, అల్లికలు... కూరగాయలు వంటి వాటిని తరగడం, భోజనాదులు చేయకూడదని చెబుతారు. ముఖ్యంగా గ్రహణం విడిచాకా రాత్రి మిగిలిన తినుపదార్ధాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదనే వాదనలను కొట్టిపారేసే వాళ్లు కొందరున్నా... మెజారిటీ వర్గం ప్రజలు మాత్రం బలంగా నమ్ముతారు. గ్రహణం పట్టింది మొదలు విడిచే వరకు గర్భిణీలకు కావాల్సిన సపర్యలు కుటుంబ సభ్యులు చేయడం... వారి పట్ట ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. 


ఇక కూరగాయలు తరగడం వంటివి చేస్తే... చేతి వేళ్లు సహా ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుందనే భావన కూడా ఉంది. ఎంతో మంది పిల్లలు.. వారి తల్లులు గ్రహణ కాలంలో చేసిన పనుల వల్ల అవిటివాళ్లుగా పుట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని కొంతమంది పెద్దలు చెబుతుంటారు. ఇక ఆహార వ్యవహారాల విషయంలో సైతం ఎన్నో నిబంధనలు పెట్టారు మన పూర్వీకులు. గ్రహణం పట్టిన సమయంలో సూర్య, చంద్రుల నుంచి వెలువడే కిరణాలు మనస్సు... శరీరంపై పెను ప్రభావాలు చూపుతాయని అంటారు. అంతేకాదు దేవాలయాల్లో ఉన్న దేవుళ్ల విషయంలో కూడా గ్రహణ నిబంధనలు పాటిస్తారు. గ్రహణానికి ముందు ఆలయాలు మూసివేయడం.. గ్రహణం తర్వాత సంప్రోక్షణ వంటి పవిత్ర కార్యాలు జరపడం కూడా అందులో భాగమే. ఇలాంటి అంశాలను ఎవ్వరూ కొట్టిపారేసే సాహసం చేయలేరు.


సైన్స్ అభివృద్ధి చెందినా ఇప్పటికీ పురాణాలను నమ్మేవారి సంఖ్యే ఎక్కువ... 
మరోవైపు సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డు వచ్చినపుడు అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడుతుందని... చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి అడ్డుపడితే పౌర్ణమి నాడు చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతుందని ఆధునిక విజ్ఞానవేత్తలు చెబుతారు. అయితే పురాణాలు చెప్పే కథలు, కథనాలను వారు కొట్టి పారేసినా... ఇప్పటికీ భారతీయ పంచాంగ సిద్ధాంతులు చెప్పే వాటినే దేశవ్యాప్తంగా ఉన్న మెజారిటీ ప్రజలు నమ్ముతారు. 


DISCLAIMER: ముఖ్య గమనిక: సమాజంలో ఉండే మూఢనమ్మకాలు... ఇతర అంశాలతో జీ న్యూస్‌కు ఎలాంటి సంబంధం లేదు.


Also read : Sani Dosha Remedies: కుంభరాశిలోకి ప్రవేశించబోతున్న శని... దోష నివారణకు ఈ విధంగా చేయండి!


Also read : Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు ఈ దానం చేస్తే... అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.