Solar Eclipse 2022: భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడాన్ని సూర్యగ్రహణం అంటారు. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం దీపావళి తర్వాత రోజైన అక్టోబరు 25న రానుంది. సాధారణంగా సూర్యగ్రహణం (Surya Grahan 2022) అమావాస్య రోజే ఏర్పడుతుంది. ఈనెల 25న ఏర్పడేది పాక్షిక సూర్యగ్రహణం. ఈ గ్రహణంలో సూర్యుడు, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉండరు. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగానే అడ్డుకుంటాడు. అందుకే దీనిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. సూర్యగ్రహణ కాలంలో దేశంలోని అన్నీ ఆలయాలు మూసివేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం ఐరోపా, యురల్స్, పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా మరియు ఆఫ్రికా యొక్క ఈశాన్య ప్రాంతాల నుండి కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం సూర్యాస్తమయానికి ముందు ప్రారంభమవుతుంది. అండమాన్ & నికోబార్ దీవులు మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల నుండి ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో గ్రహణం ఎక్కువ సేపు కనిపించే అవకాశం ఉంది. పాక్షిక సూర్యగ్రహణాన్నే ఆంషిక్ సూర్య గ్రహణం అని కూడా పిలుస్తారు. తదుపరి సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది  భారతదేశం నుండి కూడా కనిపిస్తుంది 


సూర్య గ్రహణం ఇండియా టైమింగ్స్ 2022:
గ్రహణం సమయంలో దేశ ప్రజలు సూర్యుడిని 43 శాతం మాత్రమే చూడగలరు. ఢిల్లీలో సాయంత్రం 4.29 గంటలకు, ముంబైలో సాయంత్రం 4.49 గంటలకు, చెన్నైలో సాయంత్రం 5.14 గంటలకు, బెంగళూరులో 5.12 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుంచి గ్రహణాన్ని చూడవచ్చు. 49 నిమిషాల పాటు గ్రహణం ఉంటుంది. 


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Solar Eclipse 2022: ఈ రాశుల వారికి సూర్యగ్రహణం ఎఫెక్ట్.. అక్టోబర్‌ 25 నుంచి వీరికి డబ్బే..డబ్బు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook