Surya Grahan 2023: సూర్య గ్రహణం నాడు శుభ యోగం.. ఈ 5 రాశుల వారిపై డబ్బు వర్షం! ప్రేమ జీవితం అద్భుతం
These 5 zodiac sign peoples will success in love due to Surya Grahan 2023. సూర్య గ్రహణం 2023 సందర్భంగా ప్రీతి మరియు సర్వార్థ సిద్ధి వంటి చాలా పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి.
These 5 zodiac sign peoples will success in love due to Surya Grahan 2023: ఈ సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న వైశాఖ అమావాస్య నాడు ఏర్పడుతుంది. ఈ సూర్య గ్రహణం ఉదయం 7.4న ప్రారంభమై మధ్యాహ్నం 12.29 వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతకం కూడా ఉండదు. అయితే ఈ సూర్య గ్రహణం సందర్భంగా ప్రీతి మరియు సర్వార్థ సిద్ధి వంటి చాలా పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా గ్రహణం యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది.
గ్రహణ సమయంలో సూర్యుడు అశ్వినీ నక్షత్రం మరియు మేష రాశిలో ఉంటాడు. ఈ సమయంలో బుధుడు మరియు రాహువు కూడా సూర్యుడునితో ఉంటారు. హిందూ విశ్వాసాలలో గ్రహణం ఎప్పుడూ కూడా శుభప్రదంగా పరిగణించబడదు. కానీ అరుదైన శుభ యోగాల కారణంగా.. కొన్ని రాశుల వారికి ఈ గ్రహణం చాలా అదృష్టంగా మారనుంది. ముఖ్యంగా 5 రాశుల వారికి డబ్బు వర్షం కురుస్తుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు సూర్య గ్రహణం నాడు వచ్చే యోగాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ పొందవచ్చు. సహోద్యోగులు మరియు అధికారులతో మీ సంబంధాలు బాగుంటాయి. మీరు ఖర్చులను నియంత్రించాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో బాగుంటారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి సూర్య గ్రహణం నాడు ఏర్పడబోయే శుభ యోగం లాభిస్తుంది. మీరు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రతిభ అందరి ముందు ప్రదర్శించబడుతుంది. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆగిపోయిన డబ్బుని తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి.
సింహ రాశి:
సూర్య గ్రహణం నాడు వచ్చే ప్రత్యేక యోగం వల్ల సింహ రాశి వారికి మంచి రోజులను తెస్తుంది. విద్యార్థులు బాగా చదువుతారు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. పిల్లల వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. డబ్బు కొరత ఉండదు. మీరు ల్యాండ్ కూడా కొనుగోలు చేయవచ్చు. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి.
కుంభ రాశి:
సూర్య గ్రహణం కుంభ రాశి వారికి చాలా శుభప్రదమైన ప్రభావం చూపుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఉంటే దూరమవుతుంది. మీరు అదృష్టం కంటే మీ శ్రమపై ఎక్కువ దృష్టి పెట్టండి. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది.
కర్కాటక రాశి:
సూర్య గ్రహణం యొక్క మంచి ప్రభావం కర్కాటక రాశిపై కూడా ఉంటుంది. అదృష్టం కారణంగా కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులు, సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటే.. మీ కోరిక నెరవేరుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.
Also Read: Tamannaah Bhatia Bikini Pics: తమన్నా భాటియా బికినీ ట్రీట్.. మిల్కీ బ్యూటీది మామూలు అందం కాదు!
Also Read: Catherine Tresa Hot Pics: పొట్టి డ్రెస్‌లో కేథరిన్ థ్రెసా పరువాల విందు.. హాట్ అందాలు చూడతరమా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.