Solar Eclipse 2023: ఈ ఏడాది అంటే 2023లో రెండు సూర్య గ్రహణాల్లో చివరిది మరో 14 రోజుల్లో ఏర్పడనుంది. అక్టోబర్ 14న ఏర్పడనున్న సూర్య గ్రహణం ప్రభావం ఎలా ఉంటుంది, సూతక కాలం ఉందా లేదా అనే వివరాలు పరిశీలిద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023లో మొదటి సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఇప్పటికే ముగిశాయి. ఇక ఈ నెలలో రెండవ సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఉన్నాయి. ఇందులో సూర్య గ్రహణం అక్టోబర్ 14న ఏర్పడనుండగా, చంద్ర గ్రహణం అక్టోబర్ 28వ తేదీన ఉంది. అక్టోబర్ 14వ తేదీ రాత్రి 8.34 గంటలకు ప్రారంభమై..2.25 గంటలకు పూర్తి కానుంది. ఈ సూర్య గ్రహణం ఇండియాలో కన్పించదు. అందుకే ఇక్కడ సూతక కాలం కూడా వర్తించదు. అయితే ఈ సూర్య గ్రహణం ప్రభావం మాత్రం మొత్తం 12 రాశులపై పడుతుంది.  ఈ సూర్య గ్రహణాన్ని ఉత్తర అమెరికా, కెనడా, గ్వాటెమాలా, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, క్యూబా, బార్బడోస్, పెరూ, ఉరుగ్వే, యాంటిగ్వా వంటి దేశాల్లో కన్పించనుంది. 


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహణాన్ని అత్యంత మహత్వపూర్వకంగా పరిగణిస్తారు. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడి వెలుగు భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుకుంటాడు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖాంశంపై ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. సూర్య గ్రహణం సమయంలో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేస్తే సంపూర్ణ సూర్య గ్రహణంగా పరిగణిస్తారు. అదే కొద్దిభాగం మాత్రమే కప్పేస్తే పాక్షిక సూర్య గ్రహణం అంటారు. ఈసారి ఏర్పడేది వలయాకార గ్రహణం. ఇందులో చంద్రుడి పూర్తిగా సూర్యుడిని కప్పజాలదు. సూర్యుడి బయటి భాగం ఓ గాజులా కన్పిస్తుంది. 


ఈ సూర్య గ్రహణం ఇండియాలో కన్పించనందున సూతక కాలం కూడా ఉండదిక్కడ. సూతక కాలం అంటే విగ్రహాలను ముట్టుకోవడం లేదా పూజాది కార్యక్రమాలు నిర్వహించకపోవడాన్ని అంటారు. ఈ సమయంలో పూజలు లేదా శుభ కార్యాలు చేయకూడదు. చాలామందైతే గ్రహణం సమయంలో తిండి ఆహారాలు కూడా మానేస్తుంటారు. గర్భిణీ మహిళలు ఇంటి నుంచి బయటకు రాకూడదంటారు. ఎందుకంటే గర్భంలో శిశువుకు ఇది మంచిది కాదని ప్రతీతి. ఇండియాలో కన్పించనందున ఇక్కడ ఈ సూతక కాలం కూడా ఉండదు. ఎలాంటి పనులపై నిషేధం లేదు.


జ్యోతిష్యం ప్రకారం సూర్య గ్రహణం కన్పించకపోయినా అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఈసారి సూర్య గ్రహణం సమయం ప్రత్యేకించి మేషం, కర్కాటకం, తులా, మకర రాశులపై పడుతుంది. అందుకే ఈ రాశుల జాతకులు అప్రమత్తంగా ఉండాలి.


Also read: Lucky Gemstones: ఈ 5 రత్నాలు ఇలా ధరిస్తే..పేదరికం మటుమాయం, వద్దంటే వచ్చి పడే డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook