Solar Eclipse 2022: దీపావళి రోజే ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. రాత్రికి రాత్రే మారిపోనున్న ఈరాశుల అదృష్టం...
Solar Eclipse 2022: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ చివరిలో ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం మూడు రాశుల వారికి శుభప్రదం కాబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Grahan 2022 In October: ఈ ఏడాది రెండవ మరియు చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25న అంటే దీపావళి రోజున ఏర్పడబోతోంది. హిందూమతంలో గ్రహణం ఒక అశుభకరంగా భావిస్తారు. ఈ గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయడం నిషేధం. ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న ఏర్పడింది.
అక్టోబర్ 25న కనిపించే సూర్యగ్రహణం భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీనిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. ఈఏడాది మన దేశంలో కనిపించనున్న సూర్యగ్రహణం (Solar Eclipse 2022) ఇది. ఆస్ట్రాలజీ ప్రకారం ఈసారి తులరాశిలో గ్రహణం ఏర్పడబోతుంది. దీని వల్ల మూడు రాశులు వారు ప్రయోజనం పొందనున్నారు. ఈ ఏడాది చివరి గ్రహణం అక్టోబర్ 25 సాయంత్రం 4:29 నుండి 5:42 వరకు ఉంటుంది. భారత్‌తో పాటు యూరప్, ఆఫ్రికా ఖండంలోని ఉత్తర భాగం, ఆసియా నైరుతి భాగం, అట్లాంటిక్‌లో ఈ సూర్యగ్రహణం పూర్తిగా కనిపించనుంది.
సూతక కాలం
జ్యోతిష్యంలో గ్రహణానికి ముందు వచ్చే సూతకాలానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణం యొక్క సూతకం 12 గంటల ముందుగానే మెుదలై.. గ్రహణం ముగిసిన తర్వాత ముగుస్తుంది. ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. సూతక కాలం అశుభమైనదిగా భావిస్తారు. గ్రహణ సమయంలో సూర్యుడు తులారాశిలో సంచరిస్తాడు. అయితే ఈ గ్రహణం కొన్ని రాశులవారికి మాత్రం శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకోండి.
ఈరాశులకు శుభప్రదం
మేషం (Aries)- ఈ రాశి వారికి గ్రహణం వల్ల విశేష ప్రయోజనం కలుగుతుంది. సంఘంలో ప్రతిష్ట పెరుగుతుంది. దీనితో పాటు ఈరాశివారికి అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి.
కర్కాటకం (Cancer)- సూర్యగ్రహణం వల్ల ఈ రాశి వారికి ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో ఈరాశివారు శుభవార్తను వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కుంభం (Aquarius)- సూర్యగ్రహణం కుంభరాశి ప్రజలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. సంపద కూడా పెరిగే అవకాశం ఉంది.
Also Read: Surya Gochar 2022: దసరా తర్వాత సూర్యుడు రాశి మార్పు.. ఈ 5 రాశులవారి కెరీర్ కు మాంచి ఊపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి