Ratha Saptami 2025: రథసప్తమి సందర్భంగా తిరుమల దర్శనంపై ప్రత్యేక సమీక్ష.. భేటీ కానున్న పాలకమండలి..!

TTD latest update: రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబవుతోంది. అందుకు సంబంధించి ప్రత్యేక సమీక్ష నిర్వహించి.. పాలకమండలి పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఈ విషయం గురించి పాలకమండలి ఈరోజు భేటీ కానుంది అని సమాచారం. తిరుమలలో రథసప్తమి సందర్భంగా దర్శనంపై ఎటువంటి ఆంక్షలు ఉంటాయి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Tirumala News: సమస్త లోకానికి సూర్యుడు మూలాధారం.. ఆయన లేనిదే ఈ జగత్తు లేదు. విశ్వం ఆయన చుట్టూ తిరుగుతుంది. హిందూ సాంప్రదాయంలో అత్యున్నతమైనదిగా చెప్పుకునే పంచాంగానికి ఆంధ్రుడు కూడా సూర్యుడే. అలాంటి సూర్యుడి.చుట్టూ పరిభ్రమణం ఆధారంగానే రోజులు, వారాలు, తిధులు మనకు ఏర్పడతాయి. అందుకే సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తూ కొలుస్తూ ఉంటాం.
సమస్త జగత్తులో చీకట్లను తొలగించి, వెలుగును ప్రసాదిస్తాడు. అంధకారాన్ని పారద్రోలే జ్ఞాన పూర్ణుడిగా పేరుపొందిన సూర్యుడిని పూజించడానికి కూడా ఒకరోజు ఉంది. అదే రథసప్తమి. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీన అంటే మంగళవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది. రథసప్తమి పండుగ కోసం తిరుమల కూడా ముస్తాబుతోంది.
దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లపై టీటీడీ దేవస్థానం అదనపు కార్యనిర్వాహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహిస్తున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈ సమావేశం ఏర్పాటయింది. వీరబ్రహ్మం తదితరులు కూడా హాజరయ్యారు. రథసప్తమి సందర్భంగా సమీక్ష నిర్వహించగా అందులో భేటీ అయిన వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. టీటీడీ వివిధ విభాగాల అధికారులు విజిలెన్స్ సెక్యూరిటీ ,పోలీసులతో సమన్వయం చేసుకొని ముందస్తు ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించారు.
అలాగే భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేయాలని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు.ఇక ట్రాఫిక్ , పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరిన ఆయన సమగ్ర బందోబస్తు పై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు , వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కూడా వెంకయ్య చౌదరి తెలిపారు. అలాగే రెండు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చూడాలని వెంకయ్య చౌదరి తెలిపారు. అన్న ప్రసాదం, శ్రీవారి సేవలకు పారిశుద్ధ్యం, వైద్య బృందాలు, ఎల్ఈడి స్క్రీన్లు ఇలా తదితర ఏర్పాట్ల గురించి ఆయా విభాగాలకు చెందిన అధికారులను అడిగి మరీ ఆయన తెలుసుకున్నారు. శ్రీవారి మెట్టు టోకెన్ల జారీ కౌంటర్లపై కూడా సంబంధిత అధికారులతో సమీక్షించారు.
Also Read: చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
Also Read: Prakash Raj Kumbha Mela: కుంభమేళాలో ప్రకాష్ రాజ్ పుణ్య స్నానాలు.. స్పందించిన నటుడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.