Sravana Masam 2022: శివుని అనుగ్రహం పొందడానికి శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైనది. ఈ మాసంలో పూజలు చేయడం వల్ల మీకు పుణ్యఫలం లభిస్తుంది. శ్రావణ మాసంలో (Sravana Masam 2022) కొన్ని రాశులవారిపై లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునరాశి (Gemini) - మిథున రాశి వారికి శ్రావణ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరు అపారమైన డబ్బు సంపాదిస్తారు.  వివాదాలు పరిష్కరించబడతాయి. ఈ సమయంలో పేదవారికి సహాయం చేస్తే.. మీరు లాభపడతారు.  


తుల రాశి (Libra)- శ్రావణ మాసంలో తుల రాశి వారి పలుకుబడి పెరుగుతుంది. లక్ష్మీదేవి కృపతో భారీగా డబ్బు సంపాదిస్తారు. పదవి పొందే అవకాశం ఉంది. మీరు మంచిగా మాట్లాడటం వల్ల చాలా పనులు సులభంగా పూర్తవుతాయి.  


సింహం (Leo)- సింహ రాశి వారికి శ్రావణ మాసం కలిసి వస్తుంది. వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. 


ధనుస్సు రాశి (Sagittarius) - ధనుస్సు రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రం ఉంటుంది. ఈ రాశి వారు పెద్ద మెుత్తంలో డబ్బు సంపాదిస్తారు. కొత్త జాబ్ రావచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఏదైనా పనిని ప్రారంభించేందుకు ఇదే సరైన సమయం.  


మీన రాశి (Pisces)- మీన రాశి వారు శ్రావణ మాసంలో శుభవార్త వింటారు. వీరికి ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆగిపోయిన డబ్బు మీ వద్దకు చేరుతుంది.  మీరు కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఈ సమయంలో దానం చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు.  


Also Read: Sun Transit effect: కర్కాటక రాశిలో సూర్య సంచారం... ఈ రాశివారికి డబ్బే డబ్బు!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook