Sravana Masam 2023: 2023 శ్రావణ మాసం త్వరలో ప్రారంభం కానుంది. హిందూ మతంలో శ్రావణ మాసానికి అత్యంత మహత్యం, ప్రాధాన్యత ఉన్నాయి. శ్రావణ మాసం ప్రారంభం రోజే శ్రావణ సోమవతి అమావాస్య కావడంతో మరింత విశిష్టత ఆపాదించుకుంది. కొన్ని పూజలు చేస్తే కోటీశ్వరులు కావచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతం ప్రకారం శ్రావణ మాసం అంటే అత్యంత భక్తిశ్రద్ధలతో గడిపే నెల, ఈ నెలలో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే శివుడు ప్రసన్నుడై కటాక్షం లభిస్తుందంటారు. భోళేనాధుడిని ప్రసన్నం చేసుకుంటే కోర్కెలు చిటికెలో నెరవేరుతాయంటారు. ఈ ఏడాది శ్రావణ మాసం జూలై 17న ప్రారంభం కానుంది. అదే రోజు శ్రావణ సోమవతి అమావాస్య కావడంతో మరింత ప్రాధాన్యత చేకూరుతోంది. ఆ రోజున మూడు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. శ్రావణ సోమవారం కావడంతో కొన్ని ప్రత్యేక పూజలు చేస్తే ఊహించని ప్రయోజనాలు చేకూరుతాయి. శ్రావణ సోమవతి అమావాస్త జూలై 16వ తేదీ రాత్రి 10.08 గంటలకు ప్రారంభమౌతుంది. ఉదయ తిధి కావడంతో జూలై 17న జరుపుకుంటారు. జూలై 18వ తేదీ రాత్రి 12.01 గంటలకు ముగుస్తుంది. 


శ్రావణ సోమవతి అమావాస్య రోజున రుద్రాభిషేకం చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుందంటారు. ఈ రోజున ఉపవాసముంటే అన్ని కోర్కెలు నెరవేరుతాయి. ఈ రోజున శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే ఉద్యోగ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అంటే పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. మరోవైపు జూలై 17 శ్రావణ సోమవతి అమావాస్య రోజున రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఇంట్లో పేదరికం పోతుందంటారు. కష్టాలు తీరిపోతాయి. అనారోగ్యంతో బాధపడుతుంటే..ఆరోగ్యం కలుగుతుంది. పెళ్లి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. దీనికోసం సోమవతి అమావాస్య రోజున ఉదయం ఆవుకు 5 తాజా పండ్లు తినిపిస్తే 33 కోట్ల దేవతలు ఆశీస్సులు అందిస్తారు. తులసి మొక్క చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి.


చేతిలో డబ్బు నిలవకపోయినా లేదా తగినంత సంపాదన లేకపోయినా శ్రావణ మాసంలో బేళపత్రాల్ని 5 సోమవారాలు శివలింగానికి అర్పించాలి. ఆ తరువాత ఆ పత్రాల్ని మీ పర్సు లేదా డబ్బులు దాచే చోట ఉంచాలి. ఇలా చేస్తే మీ ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో సదా లక్ష్మీదేవత కటాక్షం ఉంటుంది. దాంపత్య జీవితంలో సంతాన ప్రాప్తి కలగకపోతే శ్రావణమాసం అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుందంటారు జ్యోతిష్యులు. దీనికోసం మీ వయస్సుకు తగ్గ బేళపత్రాలు తీసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా పచ్చి పాలు తీసుకోవాలి. ఒక్కొక్క బేళపత్రాన్ని పాలలో ముంచి శివలింగానికి అర్పిస్తుండాలి. ఇలా కనీసం 7 సోమవారాలు చేయాలి. 


Also read: Lucky Birth: ఈ మూడు నెలల్లో పుట్టి ఉంటే ఇక వారికి తిరుగుండదు, అంతా విజయమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook