Sravana Masam Lucky Zodiac Signs: హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఇదే సమయంలో శుభ గడియలు కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా అనేక రకాల శుభ కార్యక్రమాలు కూడా మొదలవుతాయి. అందుకే అన్ని తెలుగు నెలలకంటే ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ నెలను ఎంతో పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమయంలో పార్వతీ పరమేశ్వరులను పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలన్నీ ఎంతో సులభంగా నెరవేరుతాయి. అలాగే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ శ్రావణ మాసంలో అదృష్టాన్ని పొందబోతున్న రాశుల వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి: 
శ్రావణ మాసంలో వృషభ రాశి వారిపై ప్రత్యేకమైన శుభ ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరు ఎలాంటి పనులు చేసిన ఊహించని డబ్బును పొందుతారు అలాగే వీరు అన్ని రంగాల్లో విజయాలు సాధించే ప్రత్యేకమైన శక్తిని పొందే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సమయంలో భారీ లాభాలు కలుగుతాయి. దీంతోపాటు వ్యాపారాలు పెట్టుబడును పెట్టడం వల్ల భాగస్వాముల మధ్య మంచి ఒప్పందం కూడా కుదురుతుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


తులారాశి: 
తులా రాశి వారికి శ్రావణ మాసంలో జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా వ్యాపారాలు పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు. అలాగే శివుడి అనుగ్రహంతో వీరికి కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం ఎంతో మేలు చేస్తుంది. కుటుంబ జీవితం గడుపుతున్న తులా రాశి వారికి ఈ సమయంలో ఆనందంతోపాటు సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే వీరికి కుటుంబ సభ్యుల సపోర్టు లభించి ఈ మాసంలో కొన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తారు. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


మకర రాశి: 
శ్రావణ మాసంలో మకర రాశి వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా వీరు కెరీర్ కు సంబంధించిన జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. జాబ్ లేని ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ కూడా లభిస్తాయి. ఇప్పటికే జాబ్ ఉన్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో విపరీతమైన డబ్బును సంపాదిస్తారు. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి. భాగస్వాముల మధ్య మధురమైన సమయం ఏర్పడుతుంది. అలాగే అనుకున్న పనులు కూడా ఎంతో వేగంగా చేయగలుగుతారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి