Sravana Masam 2022: శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం? ఏం చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు?
Sawan Month 2022: వచ్చే నెలలో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసం పరమశివుడికి ఎంతో ఇష్టమైనది. శ్రావణ మాసంలో ఈ చర్యలు చేయడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి.
Sravana Masam Significance: శ్రావణ మాసం శివుడికి (Lord Shiva) ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ ఏడాది శ్రావణ మాసం జూలై 14న ప్రారంభమై.. ఆగస్టు 12 వరకు ఉంటుంది. ఈ మాసంలోని (Sravana Masam 2022) సోమవారాల్లో మహిళలు ఉపవాసాలు ఉంటూ.. నోములు, వ్రతాలు, పూజలు చేస్తారు. ఈ ఏడాది శ్రావణంలో 5 సోమవారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో కొన్ని ముఖ్యమైన పండుగలు కూడా వచ్చాయి. ఆగస్టు 2న నాగపంచమి, ఆగస్టు 11న రక్షాబంధన్ జరుపుకోనున్నారు. అంతేకాకుండా ఈ మాసంలోనే శని, గురు గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి.
శ్రావణ మాసం ప్రారంభం కాకముందే శని తన రాశిని మార్చనుంది. ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో ఉన్న శని.. ఆ రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశించనుంది. మరోవైపు జూలై 29న, బృహస్పతి తన సొంత రాశి అయిన మీనరాశిలో తిరోగమనం చెందనున్నాడు. ముఖ్యమైన ఈ రెండు గ్రహాల మార్పు ప్రభావం ప్రజలపై ఉంటుంది. ఈ గ్రహాల శుభఫలితాలు పొందాలంటే శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దీనితోపాటు నవగ్రహాల దోషాలు తొలగిపోవడానికి శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైనది.
శ్రావణంలో ఈ చర్యలు చేయండి
>> జీవితంలోని అన్ని దుఃఖాలు మరియు బాధలను తొలగిపోవాలంటే.. శ్రావణంలో మహాదేవుడిని పూజించండి. అంతేకాకుండా శ్రావణంలో రుద్రాభిషేకం చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
>> పంచామృతం, గంట, దాతుర, చందనం, తెల్లని పూలు మొదలైన వాటిని శివునికి సమర్పించండి.
>> శ్రావణ మాసంలో సూర్యుని పూజించి.. అర్ఘ్యం సమర్పించండి.
>> ఈ మాసంలోని అన్ని శనివారాలలో నూనె మరియు నల్ల నువ్వులను దానం చేయండి. అంతేకాకుండా గొడుగులు, బూట్లు మరియు చెప్పులు దానం చేయడం కూడా శుభప్రదమని నమ్ముతారు.
>> శ్రావణ మాసంలోని గురువారం నాడు పసుపు, శనగ దానం చేయండి. ఇలా చేయడం వల్ల గురు గ్రహం సంతోషిస్తుంది.
Also Read; Chaturmas 2022: చాతుర్మాసంలో ఈ 5 పనులు చేయడం ద్వారా.. మీ కోరికలు నెరవేరుతాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి