Sravana Shivratri 2022: శ్రావణమాసం శివరాత్రికి హిందూధర్మంలో విశేష ప్రాధాన్యత ఉంది. శివుడికి ప్రత్యేకమైన ఈ నెలలో చతుర్దశి తిధి నాడు ప్రత్యేకంగా శివరాత్రి జరుపుతారు. దీనినే శ్రావణ శివరాత్రి అంటారు. ఆ రోజు ఎప్పుడొస్తుంది, శుభ ముహూర్తం, పూజా విధానాలేంటనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రావణ మాసం శుక్లపక్షంలోని చతుర్దశి తిధి నాడు వచ్చేదే శ్రావణ శివరాత్రి. శ్రావణ మాసం శివుడికి ప్రత్యేకం కాబట్టి..శ్రావణ శివరాత్రిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. మాసిక శివరాత్రి లేదా మాస శివరాత్రి అని కూడా పిలుస్తారు. 2022లో అంటే ఈ ఏడాది శ్రావణ శివరాత్రి జూలై 26 మంగళవారం నాడు వచ్చింది. శ్రావణ శివరాత్రి జరుపుకోవాలనుకునేవాళ్లు..శ్రావణ శివరాత్రి తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానాల గురించి తెలుసుకోవాలి.


శ్రావణ శివరాత్రి 2022 శుభ ముహూర్తం, పూజా సమయం, విధానం


శ్రావణమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి తిధిన శ్రావణ శివరాత్రి జరుపుతారు. శ్రావణ మాసపు చీకటి దశ అని కూడా అంటారు. 2022 శ్రావణ శివరాత్రి జూలై 26వ తేదీ సాయంత్రం 6 గంటల 46 నిమిషాలకు ప్రారంభమై..జూలై 27వ తేదీ రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకూ ఉంటుంది. ఇక శ్రావణ శివరాత్రి పూజా సమయం జూలై 27వ తేదీన 12 గంటల 15 నిమిషాలకు ప్రారంభమై..1 గంట వరకూ ఉంటుంది. జలాభిషేకానికి సమయం 7 గంటల 23 నిమిషాల్నించి రాత్రి 9 గంటల 27 నిమిషాల వరకూ ఉంది. 


శ్రావణ శివరాత్రి మహత్యం


ఏడాది పొడుగునా ప్రతినెలలో వచ్చే శివరాత్రికి..శివభక్తులు ఉపవాసం ఉంటూ శివుడిని పూజిస్తారు. కానీ శ్రావణ మాసంలో వచ్చే శివరాత్రికి ప్రత్యేకత ఉంది. మాసిక శివరాత్రి కావడంతో అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ఎందుకంటే శ్రావణమాసం మొత్తం శివుడికి సమర్పితం. మొత్తం నెలంతా భక్తులు శివపూజలో ఉంటారు. అయితే అందరికీ సుపరిచితమైన శివరాత్రి మాత్రం ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో వస్తుంది. శివపార్వతుల పెళ్లి రోజు కాబట్టి శివరాత్రికి అంత మహత్యముంది. ఇదే రోజున శివలింగం తొలిసారిగా ఉద్భవించిందని ప్రతీక.


శ్రావణమాసంలో ఉత్తరాదిన ఉన్న కాశీ విశ్వనాధ్, బద్రినాథ్ ధామ్‌లలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భారీగా భక్తులు దర్శనం చేసుకుంటారు. వేలాది భక్తులు గంగాజలంతో శివుడిని అభిషేకిస్తారు. శ్రావణ శివరాత్రి అనేది సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, బీహార్‌లలో ఘనంగా జరుపుకుంటారు. ఇటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, గోవాల్లో మాత్రం ఆషాఢ శివరాత్రిగా జరుపుకుంటారు. 


Also read: Tulsi Pooja Tips: కోరిన కోర్కెలు నేరవేరాలంటే..తులసి మొక్కకు ప్రత్యేక పూజలు ఇలా చేయాలి



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook