Sawan Shivratri 2022: హిందువులకు పవిత్రమైన నెల శ్రావణ మాసం. ఈ మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ నెలలో శివారాధనం చేయడం వల్ల శివుడి (Lors Shiva) అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. సంతానం పొందాలనుకునేవారికి శ్రావణం ఎంతో ప్రత్యేకమైనది. అంతేకాకుండా ఈ మాసంలో వచ్చే శివరాత్రికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏడాది శ్రావణ శివరాత్రి (Sravana Shivratri 2022) 26 జూలై 2022, మంగళవారం వచ్చింది. ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా శివుడి సంతోషించి... మీ కష్టాలు తీరుస్తాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రావణ శివరాత్రి పరిహారాలు 
>> సంతానం పొందాలనుకునే దంపతులు శ్రావణ శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి. అనంతరం గంగాజలం దానిపై పోయండి. శివరాత్రి రోజు భార్యభర్తలు ఇద్దరూ కలిసి ఈ పూజా చేయాలి. అప్పుడే పరమేశ్వరుడు అనుగ్రహించి..మీకు సంతానాన్ని ప్రసాదిస్తాడు.  


>> మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే... శ్రావణ శివరాత్రి రోజున శివలింగానికి పాలు, పెరుగు, చక్కెర, తేనె మరియు నెయ్యితో అభిషేకం చేయాలి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి చేయాలి.  అనంతరం 'ఓం పార్వతీపతయే నమః' అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇలాచేయడం వల్ల శివపార్వతులు సంతోషించి మీ కష్టాలు తీరుస్తారు.


>>  మీ పెళ్లి ఆలస్యమవుతున్న లేదా ఏవైనా ఆటంకాలు ఎదురువుతున్నా వారు శ్రావణ శివరాత్రి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ రోజున పసుపు బట్టలు ధరించి శివుడి పూజించాలి. అనంతరం శివలింగంపై 108 బిల్వపత్రాలను వేయాలి. బిల్వ పత్రాలను సమర్పించేటప్పుడు 'ఓం నమః శివాయ' అని జపిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు ఫలిస్తాయి.


Also Read: Sravana Pradosh Vratam 2022: శ్రావణ ప్రదోష వ్రతం రోజు శివుడిని ఇలా పూజిస్తే.... లక్ష్మీదేవి మీ వెంటే..!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook