Ram Navami 2023: శ్రీరామ నవమికి, షిర్డీ సాయిబాబాకు లింకుందా ?
Sri Ram Navami 2023: శ్రీరామ నవమి నాడు శ్రీ రాముడిని పూజిస్తాం.. ఇది జగమెరిగిన సత్యం. అయితే, శ్రీరామ నవమి అంటే, నవమి వేడుకలు రామాలయం వరకే పరిమితం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకో చెప్పుకోవడం కంటే ముందుగా మీకు శ్రీరామ నవమికి, షిరిడిలో ఉన్న సాయి బాబాకు ఒక ప్రత్యేకమైన లింక్ ఉందనే సంగతి తెలుసా ?
Sri Ram Navami 2023: శ్రీరామ నవమి నాడు శ్రీ రాముడిని పూజిస్తాం.. ఇది జగమెరిగిన సత్యం. అయితే, శ్రీరామ నవమి అంటే, నవమి వేడుకలు రామాలయం వరకే పరిమితం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకో చెప్పుకోవడం కంటే ముందుగా మీకు శ్రీరామ నవమికి, షిరిడిలో ఉన్న సాయి బాబాకు ఒక ప్రత్యేకమైన లింక్ ఉందనే సంగతి తెలుసా ? ఏంటి త్రేతాయుగంలో ఉన్న రాముడికి, కలియుగంలో ఉన్న సాయిబాబాకు లింకు ఎలా కుదిరింది అనే కదా మీ డౌట్. ఆ సందేహం తీరాలంటే ఆ లింకు ఏంటో తెలుసుకోవాల్సిందే.
షిర్డీలోని సాయి బాబా మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరపడం అనేది అనాదిగా వస్తోన్న ఆనవాయితీ. షిర్డీ సాయిబాబా దసరా నాడే మహాసమాధిలోకి ప్రవేశించాడని చెబుతుంటారు. దసరా నవరాత్రుల సమయంలో శరద్ నవరాత్రి నాడు అంతర్ధ్యానమైన సాయిబాబా.. చైత్ర నవరాత్రుల తర్వాత వచ్చే శ్రీరామ నవమి నాడే జన్మించాడనేది భక్తుల విశ్వాసం. అందుకే దసరా నవరాత్రుల్లో వచ్చే శరద్ నవరాత్రిని, చైత్ర నవరాత్రుల్లో వచ్చే శరద్ నవరాత్రి సందర్భాలను షిర్డీలో అత్యంత వేడుకగా జరపడం అనేది అక్కడి సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. ఈ రెండు సందర్భాల్లోనూ షిర్డీలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అలా శ్రీరామ నవమి నాడు కూడా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి మరీ ఆ షిరిడీ నాథుడిని దర్శించుకుంటుంటారు.
వాస్తవానికి సాయి బాబా తొలిసారిగా షిర్డీకి ఎప్పుడు వచ్చాడనేది ఎవ్వరికీ తెలియదు. అయితే, సాయి సచ్చరిత్రలో పేర్కొన్న వివరాల ప్రకారం సాయిబాబాకు 16 ఏళ్ల వయస్సున్నప్పుడే షిర్డీకి వచ్చాడట. షిర్డీలో జరిగే ఒక వివాహానికి హాజరయ్యేందుకు వస్తున్న ఒక వ్యక్తితో కలిసి సాయి బాబా షిర్డీకి వచ్చాడని.. ఆ తరువాత జనుల శ్రేయస్సు కోరి అక్కడే ఉండిపోయాడని చెబుతుంటారు. షిర్డీ సాయిబాబా పుట్టిన తేది గురించి రకరకలా ప్రచారాలు వినిపిస్తుంటాయి. అందులో ఒకటేంటంటే.. షిర్డీ సాయి బాబా 1835, సెప్టెంబర్ 28న జన్మించాడనే ప్రచారం కూడా ఉంది. కానీ అదే వాస్తవమా అంటే కచ్చితమైన సమాధానం ఎవ్వరి వద్దా లేదు. షిర్డీ సాయిబాబా పుట్టిన రోజుపై ప్రచారంలో ఉన్న కథలు, కథనాల గురించి కాసేపు అలా పక్కనపెడితే... శ్రీ రామ నవమికి, షిర్డీ సాయినాథుడికి ఎన్నోరకాల అవినాభావ సంబంధం ఉందని షిర్డీ వాసులు కథలు, కథలుగా చెబుతుంటారు.
ఇది కూడా చదవండి : SBI Amrit Kalash FD Scheme: అత్యధిక వడ్డీ రేటు అందించే ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌కి రేపే లాస్ట్ డేట్
ఇది కూడా చదవండి : Ram Navami 2023: రాముల వారి కళ్యాణానికి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు.. ముఖ్యమంత్రికి వీహెచ్‌పీ సూటి ప్రశ్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK