Tirumala Tickets: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మార్చి 2025 కోటా విడుదల.. త్వరపడండి ఈ ఛాన్స్ మళ్లీ రాదు
March 2025 Quota Tirumala Srivari Arjitha Seva Tickets Released: తిరుమలలో శ్రీవారిని కనులారా వీక్షించేందుకు.. స్వామివారి ప్రత్యేక సేవలో తరించేందుకు ఆర్జిత సేవల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది.
Srivari Arjitha Seva Tickets: తిరుమలలో నిర్వహించే ప్రత్యేక సేవల్లో పాల్గొనే అదృష్టం అందరికీ దక్కదు. శ్రీవారిని అతి కొద్ది దూరంలో చూసే మహాద్భాగ్యం కొందరికే దక్కుతుంది. అవి కేవలం ఆర్జిత సేవల్లో మాత్రమే. అలాంటి సేవలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. 2024 మార్చి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. భక్తులు టికెట్లను పొందాలని టీటీడీ సూచించింది.
Also Read: Vaikunta Ekadasi: తిరుమల భక్తులకు షాక్.. ఆ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు
ఆర్జిత సేవలు అంటే?
తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. ఆర్జిత సేవలు అనగా స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించే సేవలు. సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా వంటి సేవలు. ఈ సేవల్లో పాల్గొనాలంటే కొన్ని నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్ పొందాల్సి ఉంటుంది. టికెట్లు ఉంటేనే ఈ సేవల్లో పాల్గొనే భాగ్యం లభిస్తుంది.
మార్చి కోటా విడుదల
ఈ సేవలకు సంబంధించి 2025 మార్చి నెల కోటాను డిసెంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం డిసెంబర్ 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఈ టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
డిసెంబరు 21వ తేదీన ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబరు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
డిసెంబరు 21వ తేదీన వర్చువల్ సేవల టికెట్లు
వర్చువల్ సేవలు.. వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల మార్చి నెల కోటాను డిసెంబర్ 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
23న అంగప్రదక్షిణం టోకెన్లు
మార్చి 2025 నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబర్ 23వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటా
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్‌లైన్ కోటాను డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను డిసెంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.
డిసెంబరు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
2025 మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబkH 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
గదుల కోటా విడుదల
పై ఆర్జిత సేవల టికెట్లు పొందిన భక్తులు గదుల కోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాల్సి ఉంది. తిరుమల, తిరుపతిలలో మార్చి నెల గదుల కోటాను డిసెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మరే ఇతర వెబ్‌సైట్లలో ఈ టికెట్లు ఉండవని.. ఇతర ఏవైనా ఉంటే వాటిని నమ్మి మోసపోకూడదని సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter