Ram Lalla Idol Inside Ayodhya Temple: జనవరి 22న ప్రధాని చేతుల మీదుగా అయోధ్య రామ మందిర శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో  పేరు పొందిన వ్యక్తులు కూడా పాల్గొంటున్నారు. ఇది ఇలా ఉండగా అయోధ్య రామమందిరంలో ఉన్న రాం లాలా విగ్రహం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ విగ్రహంపై విష్ణుమూర్తి దశావతారాలు భక్తులకు దర్శనం ఇస్తున్నాయి.  విగ్రహంలో సూర్యుడు, గణపతి, ఓం  కారం, చక్రం, శంఖం, గదా ఇతర బొమ్ములను శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ ఎంతో గొప్పగా తీర్చి దిద్దారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విగ్రహం సుమారు 51 అంగుళాలు.. 200 కిలోల బరువు:


రాంలాలా విగ్రహం కాలి నుంచి నుదుటి వరకు మొత్తం 51 అంగుళాలు ఉంటుంది. విగ్రహం బరువు దాదాపు 150 నుంచి 200 కిలోలు ఉంటుంది. విగ్రహంలో రాంలాలా కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి. ఇందులో మరో ప్రత్యేకత ఏంటి అంటే విగ్రహం అంతా దశావతారాలతో దర్శనం ఇస్తుంది.


రాంలాలా విగ్రహంపై దశావతారాలు:


తామరపుప్పుపైన రాంలాలా నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. రాంలాలా చేతిలో విల్లు, బాణం ఉంటుంది. ఈ విగ్రహం చూడానికి ఐదు సంవత్సరాల బాలుడిగా కనిపిస్తుంది. ఈ విగ్రహంలో శ్రీమహా విష్ణు దశ అవతారాలు ఎంతో  ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 


Also Read Sun transit 2024: శ్రవణ నక్షత్రంలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారికి పట్టనున్న అదృష్టం..


దశ అవతారాలు అంటే: 


మహా విష్ణువు ప్రతి యుగంలో అవతారాలను ధరించి ఉంటారు. అయితే ముందుగా మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన్‌ అవతారం, పరశురాముడు అవతారం, రామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం చివరిగా కల్కి అవతారం. ఈ మొత్తం కూడా రాంలాలా విగ్రహం మీద దర్శనం ఇస్తాయి.  అంతేకాకుండా విగ్రహం కుడిచేతిని అభయహస్తంగా బాణం పట్టుకొని ఎడమ చేతిలో విల్లు ఉంటుంది.


ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ ఎంతో అపురూపంగా తయారు చేశారు. అరుణ్‌ ఇంతకు ముందు కేదార్‌నాథ్‌లో ప్రతిష్టించిన అలీ శంకరాచార్య, ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రతిష్టించిన సుభాష్ చంద్రబోస్ వంటి ప్రసిద్ధ విగ్రహాలను తయారు చేశారు. అయితే ఈ విగ్రహం ఎందుకు నల్లరాతిలో తయారు చేశారు అంటే ఇది వందల సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఉందని నిపుణులు, పండితులు చెబుతున్నారు.  విగ్రహంపై నీరు, చందనంతో అభిషేకం చేసిన ఎలాంటి దుష్ప్రభావం కలగదు.


Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter