Surya And Jupiter Yuti 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తే.. బృహస్పతిని జ్ఞానం, విద్య, సంతనానికి కారకుడిగా పరగిణిస్తారు. మేషరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక ఏప్రిల్ నెలలో ఏర్పడనుంది. వీరిద్దరి మైత్రి ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. దీంతో మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులా రాశిచక్రం
సూర్యుడు మరియు బృహస్పతి కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఏడవ ఇంటిలో ఈ కూటమి ఏర్పడుతుంది. దీంతో పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. జీవితంలో ప్రేమ వెల్లివిరిస్తుంది. వ్యాపారులు మంచి ధనాన్ని పొందుతారు. ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
మిథున రాశిచక్రం
మిథున రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి పదవ స్థానంలో ఈ కూటమి ఏర్పడుతుంది. మీరు కెరీర్ లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. జూనియర్లు మరియు సీనియర్లతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి. 
మేష రాశిచక్రం
సూర్యుడు మరియు బృహస్పతి కలయిక ఈరాశి వారికి కలిసి వస్తుంది. ఎందుకంటే మీ ఆరోహణ ఇంట్లోనే ఈ కూటమి ఏర్పడబోతోంది. మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా మీరు లాభపడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది. 


Also Read: Trigrahi Yog 2023: శని రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు తిరుగులేని ధనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook