Surya And Jupiter Yuti: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో అరుదైన కలయిక.. ఈ మూడు రాశులకు తిరుగుండదు ఇక..
Surya And Jupiter Yuti: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, మేషరాశిలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక ఉండబోతోంది. దీని వల్ల 3 రాశుల వారు డబ్బుతోపాటు పురోభివృద్ధి సాధిస్తారు.
Sun And Jupiter Conjunction In Aries 2023: ఆస్ట్రాలజీలో గ్రహాలు కాలానుగుణంగా రాశిచక్రాలను మారుస్తాయి, దీని ప్రభావం మానవ జీవితంపై ఉంటుంది. ఏప్రిల్ ప్రారంభంలో బృహస్పతి మరియు సూర్యుడు కలయిక ఏర్పడనుంది. వీటి సంయోగం 12 ఏళ్ల తర్వాత మేష రాశిలో ఏర్పడుతుంది. ఎందుకంటే బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో (Surya And Jupiter Yuti 2023) సంచరిస్తున్నాడు. ఈ కూటమి యెుక్క ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మీరు పురోగతి సాధించడంతోపాటు అపారమైన సంపదను పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మీన రాశిచక్రం (Aries)
సూర్యుడు మరియు బృహస్పతి కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే బృహస్పతి ప్రభావం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారవేత్తలు భారీగా లాభాలను గడిస్తారు.
సింహ రాశి (Leo)
సూర్యుడు మరియు బృహస్పతి కలయిక సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో తొమ్మిదవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. ఈ సమయంలో మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహరాశిని సూర్యదేవుడు పాలిస్తాడు కాబట్టి వీటి కలయిక ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది.
కర్కాటక రాశిచక్రం (Cancer)
సూర్యుడు మరియు బృహస్పతి కలయిక మీకు వృత్తి మరియు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి పదో స్థానంలో ఈ కూటమి ఏర్పడబోతోంది. ఈ సమయంలో నిరుద్యోగులకు బృహస్పతి ప్రభావం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. వ్యాపారులు పెద్ద పెద్ద ఆర్డర్ లను పొందుతారు. తద్వారా అధిక లాభాలను ఆర్జిస్తారు.
Also Read: Shani Dev Angry: ఇలాంటి వారు శనిదేవుడి కోపానికి గురవుతారు... ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook