Budhaditya Yoga: జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒకే రాశిలో రెండు గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు. దీని ప్రభావం ప్రజలందరి జీవితాలపై ఉంటుంది. గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు ఈనెల 17న తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. మరో 9 రోజుల తర్వాత అంటే అక్టోబరు 26న గ్రహాల యువరాజు బుధుడు కూడా తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. తులరాశిలో సూర్యుడు, బుధుడు కలిసి పవర్ పుల్ బుధాదిత్య యోగాన్ని (Budhaditya Yoga) ఏర్పరచనున్నాడు. ఈ యోగం వల్ల మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధాదిత్య యోగం ఈ 3 రాశులకు శుభప్రదం
ధనుస్సు రాశి (Sagittarius): తులరాశిలో బుధాదిత్య యోగం వల్ల ఈ రాశివారికి మంచి రోజులు మెుదలవుతాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. బిజినెస్ విస్తరిస్తుంది. సమాజంలో గౌరవం  పెరుగుతుంది. వ్యాపారులు కొత్త డీల్స్ కుదుర్చుకోవడం వల్ల భారీగా లాభాలను అందుకుంటారు. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులకు ఈ సమయం కలిసి వస్తుంది. ఈ సమయంలో మణి రత్నాన్ని ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 
 కన్య రాశి (Virgo): బుధాదిత్య రాజయోగం ఈ రాశివారికి మేలు చేస్తుంది. వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దీంతో మీకు మంచి లాభాలు వస్తాయి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఉపాధ్యాయులు, మార్కెటింగ్, మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం కలిసి వస్తుంది. ఈ సమయంలో పచ్చ రాయిని ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 
కుంభ రాశి (Aquarius): బుధాదిత్య యోగం వల్ల మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగుంటుంది. 


Also Read: Mercury transit 2022: వృశ్చికరాశిలోకి బుధుడు... వీరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.        


Android Link - https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి