జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు ప్రతి నెలా రాశి మారుతుంటాడు. శని గ్రహం ప్రతి రెండున్నరేళ్లకు రాశి మారుతుంటాడు. 30 ఏళ్లు తరువాత తిరిగి ఇప్పుడు శని తన కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 17, 2023న శని గోచారం కుంభ రాశిలో జరగనుంది. అటు 13వ తేదీ ఫిబ్రవరిలో సూర్య గోచారంతో కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. సూర్యుడు మార్చ్ 14, 2023 వరకూ కుంభంలో ఉంటాడు. అంటే కుంభరాశిలో ఓ నెలరోజులు సూర్యుడు, శని కలిసే ఉండి యుతి ఏర్పాటు చేస్తారు. పలితంగా ఆ మూడు రాశులవారికి అత్యంత అశుభంగా మారనుంది. తీవ్ర నష్టం కలగనుంది. 


శని , సూర్య గ్రహాల యుతితో ఏయే రాశులకు అశుభం


కర్కాటక రాశి


సూర్య, శని గ్రహాల యుతి కారణంగా కర్కాటక రాశివారు కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాలి. ఈ పరిస్థితుల్లో మాట తీరు, వ్యవహారం అదుపు తప్పి కష్టాలపాలు జేస్తుంది. సమీప బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓ నెలరోజులు సంయమనం, అప్రమత్తత అవసరం.


వృశ్చికరాశి


వృశ్చికరాశి జాతకులకు సూర్య గోచారం, శని గోచారం కారణంగా అపారమైన ధననష్టం కలగనుంది. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ప్రత్యేకించి వ్యాపారులు ఈ సమయంలో పెట్టుబడుల్నించి దూరంగా ఉండాలి. ఆలోచించి అడుగేయాలి. అంతేకాకుండా శారీరక, మానసిక సమస్యల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. 


కుంభరాశి


సూర్య, శని రాశుల యుతి కుంభరాశిలోనే కలగనుంది. ఫలితంగా రెండు గ్రహాల కుంభరాశివారికి పెద్దఎత్తున హాని చేకూర్చనున్నాయి. నెగెటివ్ ప్రభావం పడుతుంది. డబ్బులు, బంధుత్వం, ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్రత పని ఆలోచించి చేయాలి. పెట్టుబడులు దూరంగా ఉండటం మంచిది.


Also read: Venus Transit 2023: శనిదేవుడి రాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశుల వారు ధనవంతులవ్వడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook