Sun and Venus transit Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా వక్రావస్థ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ముఖ్యంగా ఆయా రాశులవారి జీవితంపై తీవ్రంగా ఉంటుంది. సూర్యుడు, శుక్ర గ్రహాల కలయికతో ఆ మూడు రాశులపై ఎలాంటి ప్రభావం పడనుందో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం ఓ వ్యక్తి కుండలిలో శుక్రుడు అనుకూల స్థితిలో ఉంటే ఆ వ్యక్తి భౌతిక, వైవాహిక సుఖాలతో పాటు సంతాన సుఖాన్ని కూడా పొందుతాడు. అందుకే వ్యక్తి వివాహం, సంతానం సంబంధిత విషయాల గురించి తెలుసుకునేందుకు కుండలిలో శుక్రుడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకుంటారు. ఏదైనా గ్రహం రాశి మారుతుంటే..ఆ ప్రభావం అన్ని రాశులపై ఆర్ధికంగా, వైవాహికంగా ఉంటుంది. 


ఆగస్టు 7వ తేదీన శుక్రగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో ఇప్పచికే సూర్యుడు ఆశీనుడై ఉన్నందున కర్కాటక రాశిలో సూర్యుడు, శుక్ర గ్రహాల కలయిక జరుగుతుంది. ఈ కలయిక ప్రభావం అన్ని రాశుల జీవితాలపై స్పష్టంగా కన్పిస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశులవారికి అంతులేని సుఖం, ధన సంపదలు లభిస్తాయి.


కన్యారాశి


శుక్రుడు సూర్య గ్రహాల కలయిక వల్ల కన్యారాశి వారి వైవాహిక జీవితంపై ప్రభావం స్పష్టంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. ప్రేమ, పరస్పర వృద్ది ఉంటుంది. ఈ సందర్భంగా ఎప్పట్నించో ఉన్న రోగాల్నించి విముక్తి పొందుతారు. జ్యోతిష్యం ప్రకారం ఈ సమయంలో జీవిత భాగస్వామికి ఉద్యోగంలో ప్రయోజనం చేకూరుతుంది. అటు సంతాన సంబంధిత శుభవార్తలు వింటారు. 


మేషరాశి


మేషరాశి వారి జాతకంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెళ్లి జీవితం సుఖంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో గడిపేందుకు అనుకూలంగా ఉంటుంది. పరస్పరం వాదోపవాదాల నుంచి దూరంగా ఉంటారు. దాంతోపాటు వారు వినే ఓ శుభ వార్త జీవితంలో మార్పు తీసుకొస్తుంది. అనుకున్న పనులు సజావుగా జరుగుతాయి. జీవితం సుఖమయంగా ఉంటుంది.


మిధునరాశి


శుక్ర, సూర్య గ్రహాల కలయిక ద్వారా ఈ రాశి జాతకులకు అంతా శుభమే జరుగుతుంది. ఇంట్లో వాతావరణం సుఖమయంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి మంచి వౌార్తలు వింటారు. కోర్కెలు నెరవేరుతాయి. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 


అదే సమయంలో సూర్య, శుక్ర గ్రహాల కలయిక కారణంగా తుల, ధనస్సు, కుంభ రాశివారికి మాత్రం కష్టంగా మారుతుంది. ఈ రాశుల వారికి జీవిత భాగస్వామితో కలహాలు రావచ్చు. సంబంధాలు చెడిపోయే అవకాశాలున్నాయి. అందుకే కాస్త అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 


Also read: Astrology tips: కుండలిలో భద్రయోగం అంటే ఏమిటి, భద్రయోగంలో పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook